National

యూపీలో ఎంఐఎం అరాచకం..!
హిందువుల ఇళ్లకు House For Sale బోర్డులు..!!

మీరు పెళ్లి ఊరేగింపు చేసుకోవాలా..? అయితే మా పర్మిషన్ తీసుకోవాల్సిందే. మా పర్మిషన్ లేకుండా ఊరేగింపు నిర్వహిస్తే పరిణామాలు తీవ్రంగా వుంటాయి. మీరేం చేసుకుంటారో చేసుకోండి మా పర్మిషన్ లేకుండా పెళ్లి ఊరేంగిపు జరగనివ్వం. కానీ, నమాజ్ మాత్రం కచ్చితంగా జరుగుతుంది. ఒకవేళ మా పర్మిషన్ తీసుకోకుండా బరాత్ నిర్వహించినా.. బరాత్ కు మద్దతుగా ఎవరైనా బీజేపీ నేత గ్రామంలో అడుగుపెట్టినా మా తఢాకా ఏంటో చూపిస్తాం. ఇదీ హిందూ కుటుంబాలకు ఓ కరుడుగట్టిన మతోన్మాది ఇచ్చిన వార్నింగ్. సాక్షాత్తు మీడియా ముందే ప్రతిజ్ఙ చేశాడు. ఇది జరిగింది ఏ పాకిస్తాన్ లోనో, ఏ బంగ్లాదేశ్ లోనో అనుకుంటే పొరపాటే. మన దేశంలోనే. లక్షల సంవత్సరాలుగా హైందవ సంస్కృతి, సంప్రదాయాలకు ఆలవాలమైన భారత దేశంలోనే.

యూపీలోని అలీఘఢ్ జిల్లాలో వున్ నూర్పూర్ గ్రామంలో జరిగిందీ ఘటన. హిందూ కుటుంబాలకు వార్నింగ్ ఇచ్చిన ఆ ప్రబుధ్దుడి పేరు సయ్యద్ నజీమ్ అలీ. ది గ్రేట్ ఒవైసీ పార్టీ MIM కు యూపీలో యూత్ బ్రిగేడ్ అధ్యక్షుడైన నజీమ్.. గ్రామంలో మతోన్మాద విత్తనాలు నాటుతున్నాడు. మత అసంతృప్తి జ్వాలలు రగిలిస్తున్నాడు. భారత దేశంలో ఒక మతాచారం పాటించాలంటే.. ఇంకో మతం పర్మిషన్ తీసుకోవాలా..? అసలు మనం భారత దేశంలోనే వున్నమా..? అనే సందేహం కలుగుతోంది. నూర్పూర్ గ్రామంలో ముస్లింల అరాచకాలు సర్వసాధారణంగా మారిపోయాయి. ఇలాంటి ఘటనలతో ఇప్పటికే ఎన్నోసార్లు వార్తల్లోకెక్కింది. గ్రామంలో హిందువుల అణచివేత వెలుగులోకి వచ్చిన తర్వాత.. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఆ సమయంలో పరారీలో వున్న 11 మంది నేరస్తులపై ఫిర్యాదు చేసింది. ఇక, హిందువులు మైనార్టీగా మారిపోయిన ఆ గ్రామంలో.. ఫిర్యాదులు చేసినా అధికారుల నుంచి స్పందించడం లేదు.

ఓంప్రకాష్ అనే గ్రామస్తుడు మే 26న తన కూతురు వివాహం జరిపించాడు. ఈ క్రమంలో స్థానిక మసీదు గుండా బరాత్ వెళ్తుండగా.. కొందరు ముస్లింలు అడ్డుకున్నారు. అంతేకాదు, బరాత్ పై రాళ్లు రువ్వారు. ఉత్సవాలను ధ్వంసం చేశారు. తాము శాంతియుతంగా పెళ్లి బరాత్ నిర్వహిస్తుంటే మైనార్టీ వర్గానికి చెందినవారు బలవంతంగా ఆపేశారని.. ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నిస్తే దాడి చేసి కొట్టారని అన్నారు. ఆ గొడవల్లో తనకు కూడా గాయాలయ్యాయని ఓం ప్రకాశ్ తెలిపారు. నూర్పూర్ గ్రామంలో ఇలా జరగడం ఇది తొలిసారి కాదని.. హిందూ కుటుంబాలు ఎలాంటి ఫంక్షన్ చేసినా ఇలాగే ప్రయత్నపూర్వకంగా అడ్డుకుంటారని ఓం ప్రకాష్ ఆవేదన వ్యక్తం చేశారు.

అంతేకాదు, గ్రామం మీదుగా ఏ ఊరేగింపు వెళ్లినా.. కొందరు ముస్లిం యువకులు హింస, దొంగతనాలకు పాల్పడుతున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. కొన్నిసార్లు మతం మారాలంటూ ఒత్తిడి చేస్తున్నట్టు కొన్ని మీడియా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఒక సాంప్రదాయ హిందూ ఆధిపత్య గ్రామాన్ని ముస్లిం ఆధిపత్య గ్రామంగా మార్చే కుట్ర ఇది. ఒకే గ్రామంలో మూడు మసీదులు, ఒక పెద్ద మదర్సా ఉన్నాయి. వీటిని ఇటీవలే ప్రారంభించారు.

గ్రామంలో 800 కి పైగా ముస్లిం కుటుంబాలు ఉండగా, హిందూ కుటుంబాల సంఖ్య 100 మాత్రమే. ‘మైనారిటీ’ వర్గానికి చెందినవారు ఇళ్లు, ఆస్తులు త్వరగా అమ్మేసి వెళ్లిపోవాలని హిందువులను ముఖ్యంగా దళిత హిందువులను హింసిస్తున్నారు. బలవంతంగా వాళ్ల ఇంటికి ‘హౌజ్ ఫర్ సేల్’ బోర్డులు తగిలిస్తున్నారు. మొత్తానికి, నూర్పూర్ గ్రామాన్ని ముస్లిం ఆధిపత్య గ్రామంగా మార్చేందుకు కుట్ర పన్నుతున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది.

కొన్ని ముస్లిం వర్గాల అరాచకాలను ఇలాగే వదిలేస్తే.. ఒక్కో గ్రామాన్ని.. ఆ తర్వాత డివిజన్లను, జిల్లాలను కూడా కబళించినా ఆశ్చర్యపోనవసరం లేదు. మైనార్టీలకు చీమ చిటుక్కుమన్నా నానా రభస చేసే కుహనా లౌకికవాదులు, కమ్యూనిస్టులకు ఇలాంటి ఘోరాలు కనపడవు. సెక్యులరిజానికి బ్రాండ్ అంబాసిడర్ గా చెప్పుకునే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ.. తన పార్టీ యూత్ వింగ్ లీడర్ నూర్పూర్ గ్రామంలో చేస్తున్న అరాచకాలపై ఇంతవరకు స్పందించలేదు. అంటే మతమార్పిడులను, హిందువులపై దాడులను ఆయన ప్రోత్సహిస్తున్నారని అనుకోవాలా..? ఏదేమైనా యూపీ ప్రభుత్వంతో పాటు, కేంద్ర ప్రభుత్వం ఇలాంటి ఘటనలపై వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

5 × 1 =

Back to top button