మహిళల ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదటి సీజన్ ఛాంపియన్ ఎవరో అతి త్వరలో తెలిసిపోనుంది. ఆదివారం ముంబై వేదికగా తుది పోరు జరుగనుంది. ఈ పోరులో ముంబై ఇండియన్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది. టోర్నీ ఆరంభంలో ముంబై అద్భుతంగా రాణించగా.. ఢిల్లీ అనూహ్యంగా పుంజుకుంది. లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచిన ఢిల్లీ నేరుగా ఫైనల్‌కు చేరుకుంది. ముంబై ఇండియన్స్ శుక్రవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో యూపి వారియర్స్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది.
ఢిల్లీ క్యాపిటల్స్ – ముంబయి ఇండియన్స్ మధ్య జరిగే ఫైనల్.. రెండు ఆల్ రౌండ్ జట్ల మధ్య జరిగే పోటీ. టోర్నమెంట్ సగంలో ఉన్నప్పుడు ముంబై ఇండియన్స్ జట్టు వరుసగా 5 విజయాలతో దూసుకుపోతూ వచ్చింది. అయితే ఆ తర్వాత అనూహ్య ఓటములు ముంబైని దెబ్బతీశాయి. ఇక ఢిల్లీ తన ఆల్ రౌండ్ ప్రదర్శనతో మంచి విజయాలను సాధించి ఫైనల్ కు చేరుకుంది. ఆదివారం రాత్రి 7:30 కు ముంబై లోని బ్రబోర్న్ స్టేడియంలో ఇరు జట్లు తలపడనున్నాయి. అది మంచి బ్యాటింగ్ పిచ్ అని చెబుతున్నారు. ఛేజింగ్ కు అనుకూలిస్తుంది గణాంకాలు చెబుతున్నాయి. ఈ వేదికపై ఆడిన 10 లీగ్ మ్యాచ్ లలో 6 సార్లు ఛేజింగ్ జట్లు విజయాన్ని అందుకున్నాయి.
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు: మెగ్ లానింగ్(సి), షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, మారిజాన్ కాప్, అలిస్ క్యాప్సి, జెస్ జోనాసెన్, అరుంధతి రెడ్డి, తానియా భాటియా(w), రాధా యాదవ్, శిఖా పాండే, పూనమ్ యాదవ్, జసియా అక్తర్, లారా హారిస్, తారా నోరిస్, మిన్ను మణి, అపర్ణ మోండల్, టిటాస్ సాధు, స్నేహ దీప్తి
ముంబై ఇండియన్స్ జట్టు: హేలీ మాథ్యూస్, యాస్తికా భాటియా(w), నాట్ స్కివర్-బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్(సి), అమీలియా కెర్, పూజా వస్త్రాకర్, ఇస్సీ వాంగ్, అమన్‌జోత్ కౌర్, హుమైరా కాజీ, జింటిమాని కలిత, సైకా ఇషాక్, హీథర్ గ్రాహం, క్లో ట్రయాన్, ధారా గుజ్జర్, సోనమ్ యాదవ్, నీలం బిష్త్, ప్రియాంక బాలా ఉన్నారు.