పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. షెడ్యూల్ను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించారు. ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. డిసెంబర్ 7వ తేదీ నుండి శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అవుతాయని తెలిపారు. మొత్తం 23 రోజుల పాటు శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ఉంటాయని.. డిసెంబర్ 7 నుండి 29వ తేదీ వరకు ఉభయసభల సమావేశాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. ఈ శీతాకాల సమావేశాల్లో పలు అంశాలు, బిల్లులపై చర్చిస్తామని తెలిపారు. పార్లమెంట్ సమావేశాల కంటే ముందు ఈ నెల 21వ తేదీన ప్రీ బడ్జెట్ సమావేశాలను కేంద్ర ప్రభుత్వం నిర్వహించనుంది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ ఈ సమావేశాలను ప్రారంభిస్తారు. 2023-24 ఆర్థిక సంవత్సర బడ్జెట్ తయారీకి సూచనలు కోరుతూ మంత్రి సమావేశాలు నిర్వహించనున్నారు.