More

    హెల్మెట్ ను మింగిన గజరాజు

    సాధారణంగా ఏనుగులు తినడానికి ఇష్టపడే వస్తువుల్లో ఎక్కువగా పండ్లు, కూరగాయలు ఉంటాయి. కానీ అస్సాం రాష్ట్రంలో ఓ ఏనుగు బైక్ కు ఉంచిన హెల్మెట్ ను అమాంతం నోట్లోకి వేసుకుంది. ఈ వీడియోలో ఏనుగు రోడ్డు మీద నడుస్తూ ఉండగా.. రోడ్డు పక్కన బైక్ నిలిపి ఉంచడాన్ని గమనించింది. ఆ బైక్ హ్యాండిల్ కి హెల్మెట్ ఉండడాన్ని చూసింది. దాన్ని మెల్లగా పైకి లేపి నోట్లోకు వేసుకుంది. అయితే ఆ ఏనుగు నిజంగానే మింగేసిందా అన్నది కూడా టెన్షన్ పెట్టే అంశమే.. ఎందుకంటే ప్లాస్టిక్ తో చేసిన వస్తువు హెల్మెట్ కావడంతో ఏనుగు ఆరోగ్యం గురించి అందరూ ఆందోళన చెందుతున్నారు.

    అసోంలోని గువహటిలో ఈ ఘటన జరిగింది. సత్‌గావ్‌ ఆర్మీ క్యాంపు సమీపంలో సంచరిస్తున్న ఓ ఏనుగు అక్కడే రోడ్డుపై నిలిపిన బైక్‌ దగ్గరికి వచ్చి చూసింది. బైక్‌ కు తగిలించిన హెల్మెట్‌ను తొండంతో తీసుకుంది. ఆ తర్వాత రెండు అడుగులు వేసిన గజరాజు ఆ హెల్మెట్‌ను పొట్టలో వేసుకుంది. “ఇప్పుడు నా హెల్మెట్ పోయింది… దయచేసి నా హెల్మెట్ తిరిగి ఇవ్వండి. నేను ఇప్పుడు ఎలా వెళ్తాను? ” అని ఆ వీడియోలో బైక్ ఓనర్ అన్న మాటలు వినొచ్చు.

    అమ్చాంగ్ వన్యప్రాణుల అభయారణ్యం నుండి అడవి ఏనుగులు ఆహారం కోసం వెతుకుతూ తరచూ బయటకు వస్తూ ఉంటాయి. ఈ అడవి ఏనుగు కూడా అమ్చాంగ్ వన్యప్రాణుల అభయారణ్యం నుండి బయటికి వెళ్లి, ఆర్మీ క్యాంప్‌లోకి ప్రవేశించి, హెల్మెట్ తీసుకుంది. కానీ ఇలా మింగేస్తుందని ఎవరూ అసలు ఊహించలేదు.

    Related Stories