More

    ఇష్టం లేని పెళ్లి చేసుకుంది.. అయితే భర్తను ప్రియుడితో కలిసి చంపేసింది

    ఇటీవలి కాలంలో పెళ్లిళ్ల సమయంలో ఎన్నో దారుణాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఇష్టం లేకుండా జరుగుతున్న పెళ్లిళ్లలో ఊహించని ట్విస్ట్ లు చోటు చేసుకుంటూ ఉన్నాయి. కొద్దిరోజుల కిందట కాబోయే భర్తకు ‘సర్ప్రైజ్’ ఇచ్చిన ఘటనను మరువకముందే.. మరో మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను అంతం చేసింది. అది కూడా పెళ్ళైన నెలరోజుల్లోనే దారుణానికి ఒడిగట్టింది.

    ప్రియుడితో కలిసి గొంతు నులిమి భర్తను హత్య చేసింది. సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక మండలం చిన్ననిజాంపేటకు చెందిన కోనాపురం చంద్రశేఖర్ (24)కు తొగుట మండలం గుడికందుల గ్రామానికి చెందిన శ్యామల (19)తో మార్చి 23న వివాహం జరిగింది. పెళ్లి ముందునుంచే అదే గ్రామానికి చెందిన శివకుమార్ (20)తో శ్యామల ప్రేమలో ఉంది. పెద్దల బలవంతంతో చంద్రశేఖర్‌తో పెళ్లికి అంగీకరించినా ప్రియుడిని మర్చిపోలేకపోయింది. ప్రియుడితో కలిసి భర్తను హతమార్చాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా గత నెల 19న ఆహారంలో ఎలుకల మందు కలిపి భర్తకు వడ్డించింది. అస్వస్థతకు గురైన భర్త హైదరాబాద్‌లో చికిత్స చేయించుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. మొక్కు ఉందని, తీర్చుకునేందుకు వెళ్దామంటూ గత నెల 28న భర్తతో కలిసి బైక్‌పై బయలుదేరింది. అనంతసాగర్ శివారులో ఏకాంతంగా గడుపుదామంటూ అక్కడి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లింది. అప్పటికే అక్కడకు ప్రియుడు శివ చేరుకున్నాడు. అతడి స్నేహితులు రాకేశ్, రంజిత్, శ్యామల మేనబావ సాయికృష్ణ, వరుసకు సోదరుడైన భార్గవ్ కలిసి చంద్రశేఖర్‌పై దాడిచేశారు. అపై అందరూ కలిసి చంద్రశేఖర్‌ను కదలకుండా పట్టుకోగా ప్రియుడితో కలిసి శ్యామల భర్త గొంతుకు రుమాలు బిగించి చంపేసింది. అనంతరం బంధువులకు ఫోన్ చేసి చాతీ నొప్పితో చనిపోయాడని చెప్పింది. చంద్రశేఖర్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులైన ఆరుగురు యువకులనూ అరెస్ట్ చేసి జుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.

    Trending Stories

    Related Stories