సంచలనంగా శివాజీ సినిమా..! ఎన్సీపీ అఫ్జల్ ఖాన్ భజన..!!

0
682

కొద్ది రోజుల క్రితం విడుదలైన ‘హర హర మహదేవ’ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమాను ఛత్రపతి శివాజీ మహరాజ్ చరిత్ర ఆధారంగా నిర్మించారు. అయితే ఈ సినిమాపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శివాజీ చరిత్రను వక్రీకరించారంటూ చాలామంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు. అటు శివాజీ వారసుడు శంభాజీ ఛత్రపతి కూడా ఈ సినిమాలో చరిత్రను పూర్తిగా వక్రీకరించారంటూ వ్యాఖ్యలు చేశాడు. సినిమాటిక్ లిబర్టీ పేరుతో చరిత్రను వక్రీకరించడం సరైంది కాదని తెలిపారు. అయితే ఈ సినిమాను ఎన్సీపీ కూడా వ్యతిరేకిస్తోంది. ఎన్సీపీ ఎమ్మెల్యే ‘జితేంద్ర అవ్హాద్’ సినిమా టాకీస్‎లో ప్రదర్శనను అడ్డుకోవడంతో మరో టాకీస్‎లో ప్రదర్శనలు నిలిపివేయాల్సి వచ్చింది. అయితే, శివాజీ వారసుడితో పాటు ఎన్సీపీ పార్టీ కూడా ఈ సినిమాను వ్యతిరేకించినా,.. ఇద్దరి కారణాలు మాత్రం వేర్వేరుగా ఉండటంతోనే వివాదం తలెత్తింది. ఒకవైపు శివాజీ వారసుడు చరిత్రను వక్రీకరించి నందుకు వ్యతిరేకిస్తుంటే,.. మరోవైపు ఎన్సీపీ మాత్రం శివాజీని గొప్పగా చూపి అఫ్జల్ ఖాన్ ను తక్కువ చేసి చూపారనే వాదన వినిపిస్తోంది. సినిమాను అడ్డుకున్న ‘జితేంద్ర అవ్హాద్’ మీడియాతో మాట్లాడుతూ,.. ఈ చిత్రంలో శివాజీ పాత్ర పోషించిన నటుడు ఆరడుగుల ఎత్తు ఉన్నాడని,.. కానీ శివాజీ కేవలం ఐదడుగులు మాత్రమే ఉండేవాడు కాబట్టి ఇది చరిత్ర వక్రీకరించే ప్రయత్నమని విమర్శించాడు. దీంతో పాటు ఈ సినిమాలో అఫ్జల్ ఖాన్‎ను వధించే సన్నివేశాన్ని కూడా ‘జితేంద్ర అవ్హాద్’ వ్యతిరేకించాడు. దీంతో ఎన్సీపీ గత చరిత్రను నెటిజన్లు తవ్వి తీయడం మొదలుపెట్టారు. శివాజీ అఫ్జల్ ఖాన్ ను వధించే పోస్టర్ ను ఎన్సీపీ గతంలో చాలా సార్లు వ్యతిరేకించింది.

సెక్యులరిజం ముసుగులో కాంగ్రెస్ పార్టీతో పాటు ఎన్సీపీది కూడా అదే దారి. మైనార్టీల సంతుష్టీకరణలో భాగంగా మెజార్టీలను వేధించడంతో పాటు చరిత్రను కూడా వక్రీకరించే విధానాన్ని ఇరు పార్టీలు అనుసరిస్తుంటాయి. ఇస్లామిక్ వలసవాద పాలకులను కీర్తించడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది. ఎన్సీపీ కూడా ఇదే దారిని అనుసరిస్తోంది. ఇందులో భాగంగానే.. ఛత్రపతి శివాజీ పోస్టర్‎ను కూడా ఎన్సీపీ వ్యతిరేకిస్తూ వచ్చింది. శివాజీ మహారాజ్ చరిత్రలో ఎంతో ముఖ్యమైన ఘట్టం అఫ్జల్ ఖాన్‎ను చంపడం. ఆ దుర్మార్గుడి గడ్డపైనే ఎటువంటి సైన్యం లేకుండా ప్రవేశించి.. తన చేతిలో ఉన్న పులి గోర్లలాంటి ఆయుధంతో పేగులు బయటకు తీసి చంపుతాడు. ఈ పోస్టర్ ఛత్రపతి శివాజీ అభిమానుల్లో ఎంతో ఆదరాభిమానాలను సొంతం చేసుకుంది. అయితే ఈ పోస్టర్‎ను ఎన్సీపీ ముందు నుంచి వ్యతిరేకిస్తూనే ఉంది. ఇందులో అఫ్జల్ ఖాన్ ఇతర వర్గానికి చెందిన వాడు కాబట్టి మైనార్టీ సంతుష్టీకరణ కోసం ఈ పోస్టర్ ను ఎన్సీపీ వ్యతిరేకిస్తోంది. అయితే ఇదేదో రెండో మూడో సంవత్సరాల క్రితం జరిగింది కాదు. 2009లోనే దీనికి సంబంధించిన వ్యతిరేకత వ్యక్తమైంది. 2009లో మహారాష్ట్రలో ఎన్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మిరాజ్ అనే పట్టణంలో మత ఘర్షణలు జరిగాయి. అప్పట్లో గణేష్ పండల్ లో వినాయక విగ్రహంతో పాటుగా శివాజీ అఫ్జల్ ఖాన్ ను చంపిన ఆర్చ్ ను ఏర్పాటు చేయడంతో ఈ అల్లర్లు చెలరేగాయి. స్థానిక ఎన్సీపీ కార్పొరేటర్ ‘మొయినుద్దీన్ షంసుద్దీన్’ కీలక నిందితుడిగా ఈ కేసులో అరెస్టు అయ్యాడు. అప్పట్లో ఈ అల్లర్లలో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఎంతో మంది ఆస్థులు ధ్వంసమయ్యాయి. అయితే మొయినుద్దీన్ కు అప్పటి హోంమంత్రి నుంచి పూర్తి అండదండలుండేవి. దీంతో అతడి అరెస్టును ఏడాది అడ్డుకోగలిగినా,.. చివరికి 2010 లో అరెస్టయ్యాడు.

ఇక ఈ అల్లర్ల తర్వాత ప్రతిసారీ గణేష్ మండపాల్లో ఛత్రపతి శివాజీ పోస్టర్ కు పోలీసులు అనుమతులిచ్చేవారు కాదు. ఒకవేళ ఈ పోస్టర్ కు సంబంధించిన ఆనవాళ్ళు కనిపించినా అటువంటి మండపాలపై పోలీసులు చర్యలు తీసుకునేవారు. ఈ విధంగా తరచూ నిషేధాలు అమలు చేయడంతో కొందరు బాంబే హైకోర్టు ను సైతం ఆశ్రయించారు. అయితే కోర్టు కూడా ఈ పోస్టర్ కు అనుమతిని నిరాకరించింది. దీన్ని ప్రదర్శించడం వల్ల మతఘర్షణలు తలెత్తుతాయనే ఉద్దేశంతో బాంబే హైకోర్టు కూడా అనుమతిని నిరాకరించింది. దీంతో చాలామంది హిందువులకు తమ అభిమాన రాజైన ఛత్రపతి మహారాజ్ జీవితంలో అధ్భుత ఘట్టాన్ని ప్రదర్శించేందుకు వీలులేకుండా పోయింది. ఈ విధంగా శివాజీ మహరాజ్ పోస్టర్‎పై అప్రకటిత నిషేధం వచ్చేలా విజయం సాధించిన ఎన్సీపీ,.. ఆ తర్వాత ఏకంగా అఫ్జల్ ఖాన్ పుట్టినరోజును కూడా జరుపుకునే దశకు చేరుకుంది. అఫ్జల్ ఖాన్ 350వ జయంతి జరుపుకోవడానికి ఎన్సీపీ ప్రయత్నించడంతో అప్పట్లో శివసేన దీన్ని పూర్తిగా వ్యతిరేకించింది. అయినా కూడా ఎన్సీపీ దీన్ని కొనసాగింస్తూ వచ్చింది.

తాజాగా హర హర మహాదేవ సినిమాను కూడా ఎన్సీపీ ఎమ్మెల్యే వ్యతిరేకించడం వెనుక పార్టీ మద్దతు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో చరిత్ర వక్రీకరణకు గురైందని పైకి చెబుతున్నా కూడా అంతర్గతంగా మాత్రం అఫ్జల్ ఖాన్‎కు మద్దతుగానే ఈ చర్యకు పూనుకున్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఎన్సీపీ పార్టీకి శివాజీ మహరాజ్‎పై ఏమాత్రం గౌరవం లేదనీ కేవలం అఫ్జల్ ఖాన్‎కు మద్దతివ్వడానికే ఇటువంటి చర్యలకు దిగారని ముంబై రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అయితే శివాజీ పురిటి గడ్డపై అఫ్జల్ ఖాన్‎ను కీర్తించడం వల్ల ఎన్సీపీకి ఎంతవరకు లాభిస్తుందనేది ఆ పార్టీ మరొక్కసారి ఆలోచించుకోవాల్సి ఉంటుంది.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

13 − 9 =