సినిమా ప్రమోషన్ కు మా రాష్ట్రానికి ఇప్పుడు రాకండి: ఆమిర్ కు అసోం ముఖ్యమంత్రి సూచన

0
813

బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ సినిమా లాల్ సింగ్ చద్దా ప్రస్తుతం థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమాకు నెగటివ్ రివ్యూలు చాలా ఎక్కువగా వచ్చాయి. ఇక సినిమాను మరింతగా మూవీ లవర్స్ దృష్టికి తీసుకుని వెళ్లడానికి ఆమిర్ ఖాన్ చాలా కష్టాలు పడుతూ ఉన్నారు. అందులో భాగంగా అసోం రాష్ట్రానికి వెళ్లాలని ఆమిర్ ఖాన్ అనుకోగా.. అందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమిర్ అసోం పర్యటనను వాయిదా వేసుకోవాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వా కోరారు. హర్ ఘర్ తిరంగ కార్యక్రమాన్ని ఈ నెల 13 నుంచి 15 వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని… అందువల్ల పర్యటనను వాయిదా వేసుకోవాలని ఆమిర్ ను కోరుతున్నామని అన్నారు.

ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఆయన ఈ నెల 14న గువాహటికి వెళ్తున్నాడు. ఆమిర్ తనతో కూడా మాట్లాడారని.. 75 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఎంతో స్ఫూర్తిదాయకమైనవని… అందువల్ల ఆ స్ఫూర్తి బలహీనం కాకూడదని తాము కోరుకుంటున్నామని.. అందుకే పర్యటనను వాయిదా వేసుకోవాలని ఆమిర్ ను కోరామన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం తర్వాత ఎప్పుడొచ్చినా తమకు అభ్యంతరం లేదని చెప్పామని తెలిపారు. ఆమిర్ తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని, అప్పుడప్పుడు ఫోన్ ద్వారా తాము మాట్లాడుకుంటుంటామని చెప్పారు.