దేశవ్యాప్తంగా బలవంతపు మత మార్పిడులు ఆందోళనకర స్థాయికి చేరుకుంటున్నాయి. జీహాదీ గ్రూపులు రూపం మార్చుకుంటూ విషం చిమ్ముతున్నాయి. కేరళలో లవ్ జిహాద్ తర్వాత ఇప్పుడు నార్కోటిక్ జిహాద్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ముస్లిమేతర మతాలకు చెందిన యువతను మత్తుమందులకు బానిసలుగా మార్చి మతం మార్చడం.. ఆ తర్వాత ఉగ్రవాదులుగా మార్చడమే నార్కోటిక్ జిహాద్ లక్ష్యం. ఈ నార్కోటిక్ జిహాద్‌తో హిందువులే కాదు, క్రిస్టియన్ల కూడా ప్రమాదం చిక్కుకున్నారు. ఇన్నాళ్లూ ‘లవ్ జిహాద్’ గురించి మాత్రమే భయపడిన కేరళ సైరో-మలబార్ చర్చి పాలకులకు.. ఇప్పుడు నార్కోటిక్ జిహాద్‌తో ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా కేరళకు చెందిన బిషప్ చేసిన వ్యాఖ్యలు.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి.
తాజాగా కొట్టాయం జిల్లా కురువిలంగడులోని చర్చి వేడుకల్లో ప్రసంగించిన సైరో మలబార్ చర్చ్ బిషప్ మార్ జోసెఫ్ కల్లరంగట్.. నార్కోటిక్ జిహాద్‌పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. క్రిస్టియన్ యువతను మతం మార్చేందుకు.. ముస్లిం సంస్థలు కొత్త పంథా ఎంచుకున్నాయని అన్నారు. కాథలిక్ బాలికలను, యువకులను బలవంతంగా మతమారుస్తున్నారని తెలిపారు. ఈ విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా వుండాలని.. పిల్లలు పూర్తి ఆధ్యాత్మిక వాతావరణంలో పెరిగేలా చూడాలని సూచించారు. కేరళతో సహా ప్రపంచవ్యాప్తంగా అనేక సామాజిక, మతపరమైన దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. లవ్ జిహాద్, నార్కోటిక్ జిహాద్ పేరుతో జిహాదీలు ముస్లిమేతర యువతను టార్గెట్ చేస్తున్నారని హెచ్చరించారు. ఇందు కోసం కేరళలోని వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక గ్రూపులు పని చేస్తున్నాయని.., మాదకద్రవ్యాలు, ఇతర వ్యసనాలకు బానిసైన కాథలిక్, హిందూ యువతీయువకులే లక్ష్యంగా చేసుకున్నాయని కల్లరంగట్ తెలిపారు. ఆయుధాలతో పోరాడలేని ప్రాంతాల్లో ఇటువంటి కుట్రల ద్వారా ఇతర మతాలను నాశనం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. లవ్ జిహాద్, నార్కోటిక్ జిహాద్.. రెండింటి లక్ష్యం ఇతర మతాలను నాశనం చేయడమేనని అన్నారు. ఐసిస్ శిబిరాల్లో ఇతర మతాల మహిళలు ఎందుకు ఉన్నారో పరిశీలించాలన్న ఆయన.. డ్రగ్స్‌తో క్రైస్తవ బాలికలను లక్ష్యంగా చేసుకుంటున్నారని వీరి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన హితవు పలికారు. ముస్లిం ఆలోచనా సరళిని వ్యాప్తి చేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయన్నారు.
కేరళలో కొన్నేళ్లుగా ఈ నార్కోటిక్ జిహాద్ ఇంత వేగంగా విస్తరిస్తుందో చెప్పడానికి.. ఇటీవల ఆ రాష్ట్ర మాజీ డీజీపీ చేసిన వ్యాఖ్యలే అద్దం పడుతున్నాయి. జిహాదీ మూకలు ముస్లిమేతర యువతీయువకులను మత్తుమందుకు బానిసలుగా మార్చి ఉగ్రవాదులుగా మార్చేస్తున్నారని.. కేరళ మాజీ డీజీపీ లోక్ నాథ్ బెహరా వ్యాఖ్యలు చేశారు. కేరళ ఉగ్రవాద సంస్థలకు రిక్రూట్మెంట్ హబ్‌గా మారిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడ ఉగ్రవాదులకు స్లీపింగ్ సెల్స్ ఉన్నారని తెలిపారు. ఉగ్రవాద గ్రూపులకు కేరళ సురక్షితమైన స్వర్గధామంగా ఉండటానికి మూల కారణాల్లో బలవంతపు మతమార్పిడి ఒకటని ఆరోపించారు.
2016లోనే ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర సంస్ధలో కేరళ నుంచి పలువురు చేరుతున్నారని తొలుత వార్తలు వచ్చాయి. 19 మంది గల్లంతైన వారు ఈ ఉగ్రసంస్ధలో చేరారని వారి కుటుంబ సభ్యలు, బంధువులు పేర్కొనడంతో విచారణ చేపట్టాలని అప్పట్లోనే రాష్ట్ర ప్రభుత్వం ఇంటెలిజెన్స్ బ్యూరో, రా, ఎన్ఐఏ వంటి కేంద్ర దర్యాప్తు సంస్ధలను కోరింది. కాసర్‌ఘడ్, పలక్కాడ్ జిల్లాలకు చెందిన ఈ 19 మందిలో అత్యధికులు క్రైస్తవ, హిందూ మతాల నుంచి ఇస్లాం స్వీకరించారు. 2019 సెప్టెంబర్‌లో ఓ 19 ఏళ్ల క్రిస్టియన్ యువతికి మత్తుమందు ఇచ్చి, బ్లాక్ మెయిల్ చేసి, లైంగిక వేధింపులకు గురిచేశారు. ఆ తర్వాత బలవంతంగా మతం మార్చారు. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అంతకుముందు కూడా NIA ఇలాంటివి 11 కేసులను విచారించింది. వీటిలో హిందూ యువతి హదియా కేసు కూడా వుంది. ఆమె ఓ ముస్లిం యువకుడిని పెళ్లిచేసుకున్న తర్వాత బలవంతంగా మతం మార్చారు. ఇలాంటి 89 కేసుల విషయంలో ఆధారాలు కూడా లేవు.
2006, 2012 మధ్యకాలంలో మొత్తం 7713 మంది ఇస్లాం మతంలోకి మారినట్టు.. గతంలో కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ పేర్కొన్నారు. ఇలా రాష్ట్రం మొత్తం రాడికల్ ఇస్లామిస్టులకు లొంగిపోతున్నా.. కేరళ కమ్యూనిస్ట్ సర్కార్ మాత్రం కళ్లుతెరవడం లేదు. ముంచుకొస్తున్న ప్రమాదాన్ని గుర్తించడం లేదు. కానీ, కేరళలో 19 శాతం వున్న క్రిస్టియన్లు మాత్రం లవ్ జిహాద్ ప్రమాదాన్ని ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు. చర్చి పాలకులు ‘లవ్ జిహాద్’ ఘటనలను వ్యతిరేకంగా ఇప్పుడిప్పుడే గళం విప్పుతున్నారు. లవ్ జిహాద్, నార్కోటిక్ జిహాద్ ప్రమాదాన్ని.. లౌకికవాద రాజకీయ పార్టీలు ఇప్పటికైనా గుర్తించాలని క్యాథలిక్కులు డిమాండ్ చేస్తున్నారు.
కేరళలో ఇటీవలికాలంలో లవ్ జిహాద్, నార్కోటిక్ జిహాద్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో లవ్ జిహాద్ గురించి మాట్లాడిన కేరళ స్వతంత్ర ఎమ్మెల్యే పీసీ జార్జ్.. ముస్లింలు భారత దేశాన్ని ఇస్లామిక్ కంట్రీగా మార్చేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విపత్తు నుంచి బయటపడలాంటే.. వెంటనే భారత దేశాన్ని ‘హిందూ దేశంగా’ ప్రకటించాలని డిమాండ్ చేశారు. దీనిని బట్టి కేరళలో పరిస్థితి ఎంత దారుణంగా వుందో అర్థం చేసుకోవచ్చు.
మొత్తానికి, లవ్ జిహాద్ కేవలం హిందువుల సమస్య మాత్రమే కాదని క్రిస్టియన్లు గుర్తించడం ప్రారంభించారు. ఇప్పుడు వారంతా నార్కోటిక్ జిహాద్ గురించి ఆందోళన చెందున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇస్లాంను వ్యాప్తి చేయడానికి జిహాదీ గ్రూపులు ఎలాంటి కుట్రలు చేస్తున్నాయో.. కేరళ సంఘటనలు రుజువు చేస్తున్నాయి. ఇప్పటికైనా ఈ విష సంస్కృతిని ప్రభుత్వాలు సీరియస్‌గా తసుకుని.. లవ్ జిహాద్, నార్కోటిక్ జిహాద్ మూకల పీచమణచాలని అటు హిందువులు, ఇటు క్రిస్టియన్లు కోరుతున్నారు.