మార్కెట్ లోకి వెళ్లి కూరగాయలు కొన్న కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్

0
857

త‌మిళ‌నాడు రాజ‌ధాని చెన్నై పర్య‌ట‌న‌కు వ‌చ్చిన బీజేపీ సీనియ‌ర్ నేత‌, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ మైలాపూర్ మార్కెట్‌లో కూర‌గాయ‌ల వ్యాపారులతో ఆమె మాట్లాడారు. వారు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను ఆరా తీశారు. ఆమె ఓ దుకాణం వ‌ద్ద ఆగి కూర‌గాయ‌లు కొన్నారు. ఓ బుట్ట తీసుకుని కూర‌గాయల‌ను ఏరుకున్న నిర్మల వాటిని కొనుగోలు చేశారు.

కూరగాయల మార్కెట్‌లో కనిపించిన కేంద్ర మంత్రిని చూసి జనం ఆశ్చర్యపోయారు. ఈ సందర్భంగా మంత్రి నిర్మలా కూరగాయలు కొంటున్న వీడియో తీసిన కొందరు సోషల్ మీడియాలో షేర్ చేశారునిర్మలా సీతారామన్ చిలగడదుంపలను కొనుగోలు చేశారు. దీంతో పాటు కాకరకాయలను కూడా కొనుగోలు చేశారు. నిర్మ‌లా సీతారామ‌న్ మండిలోని కూరగాయల వ్యాపారులతో కూడా మాట్లాడారు.