వినియోగదారులు/క్లయింట్లతో కనెక్ట్ కావడానికి వాట్సాప్ బిజినెస్ యూజర్లకు గొప్ప మార్గాన్ని అందించడానికి, WhatsApp ఇప్పుడు ‘ప్రీమియం’ ప్లాన్‌తో వస్తోంది. WABetaInfo నివేదిక ప్రకారం, WhatsApp Android, iOS యాప్.. తాజా బీటా వెర్షన్‌ను ఉపయోగిస్తున్న నిర్దిష్ట బిజినెస్ వినియోగదారుల కోసం WhatsApp సబ్స్క్రిప్షన్ ప్లాన్‌ను విడుదల చేసింది. సెట్టింగ్స్ ఆప్షన్లో యూజర్లకు WhatsApp Premium ఆప్షన్ కనిపిస్తుంది. WhatsApp సెట్టింగ్‌లలో ఆ ఫీచర్ కనిపిస్తే, అప్పుడు వినియోగదారు ఫీచర్లో చేరడానికి అర్హులు. దీని కోసం వినియోగదారు కొంత డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.
ప్రీమియం ఫీచర్ ద్వారా, వాట్సాప్ తన బిజినెస్ వినియోగదారులను ప్రత్యేకమైన షార్ట్ లింక్‌ని సృష్టించడానికి అనుమతిస్తుంది. లింక్‌ని ఉపయోగించి, కస్టమర్లు ల్యాండింగ్ బిజినెస్ పేజీని వీక్షించవచ్చు. దానిపై క్లిక్ చేయడం ద్వారా వారు సులభంగా కమ్యూనికేషన్ ను ప్రారంభించవచ్చు. లింక్ https://wa.me/తో ప్రారంభమవుతుంది, దాని తర్వాత బిజినెస్ పేరు ఉంటుంది. ఉదాహరణకు: https://wa.me/mybusiness లేదా https://wa.me/sab. ప్రతి 90 రోజులకు ఒకసారి లింక్/పేరును మార్చడం సాధ్యమవుతుంది. వాట్సాప్ బిజినెస్ వినియోగదారుల కోసం WhatsApp దాని ఫీచర్లలో కొన్ని ముఖ్యమైన మార్పులను చేసింది. ఇప్పుడు WhatsApp Premiumలో చేరిన వినియోగదారులు గరిష్టంగా 10 పరికరాలను WhatsAppకి లింక్ చేయగలరు, దీని వలన ఎక్కువ మంది వ్యక్తులు ఒకే WhatsApp ఖాతాలో సందేశం పంపినప్పుడు.. కనెక్ట్ అవ్వడం సులభం అవుతుంది.