More

    ఐటీ చట్టాలపై కోర్టును ఆశ్రయించిన వాట్సాప్‌, ఫేస్‌బుక్‌

    కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తెచ్చిన కొత్త ఐటీ చట్టాలను సవాల్‌ చేస్తూ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌, సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌లు న్యాయస్థానాలను ఆశ్రయించాయి. దీనిపై విచారణ చేపట్టిన ఢిల్లీ హై కోర్టు పిటిషినర్ల అభ్యంతరాలకు సమాధానం ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది.

    భారత ప్రభుత్వం సోషల్‌ మీడియా నియంత్రణకు ఇటీవలే కొత్త ఐటీ చట్టాలను అమల్లోకి తెచ్చింది. కొత్త ఐటి నిబంధన మధ్యవర్తిత్వ మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ ప్రకారం, ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు (5 మిలియన్లకు పైగా యూజర్లు) ప్రతి నెలా ఫిర్యాదుల నివేదికలను ప్రచురించాల్సి ఉంటుంది. ఆయా వేదికలపై ఫిర్యాదుల వివరాలను, దానిపై తీసుకున్న చర్యలను వెల్లడించాలి. సోషల్‌ మీడియా లేదా మెస్సేజింగ్‌ యాప్‌లలో వచ్చినప్పుడు.. మొట్ట మొదట ఆ మేసేజ్‌ ఎక్కడ నుంచి వచ్చిందనే వివరాలను కేంద్రానికి సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫారమ్స్‌ అందివ్వాల్సి ఉంటుంది. అయితే ఇలా చేయడం రాజ్యంగా స్ఫూర్తికి విరుద్ధమని కొత్త వాదనకు ఫేస్‌బుక్‌, వాట్సప్‌లు దిగాయి. తమ ఖాతాదారుల వ్యక్తిగత భద్రతకు సంబంధించిన ప్రైవేటు సమాచారాన్ని తమకు ఇవ్వమని ప్రభుత్వం కోరడం రాజ్యంగ స్ఫూర్తికి ఇది విరుద్ధమంటున్నాయి. మీ వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామని తాము ఖాతాదారులకు హామీ ఇచ్చామని దాన్ని ఉల్లంఘించలేమంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి.

    ఈ అభ్యంతరాలపై వివరణ ఇవ్వాలంటూ కేంద్రాన్ని ఢిల్లీ హైకోర్టు కోరింది. ఈ కేసు వాదిస్తున్న ప్రధాన న్యాయవాది ప్రస్తుతం అందుబాటులో లేనందున విచారణ కొద్ది కాలం వాయిదా వేయాలని కోర్టును కేంద్రం కోరింది. దీంతో ఈ కేసు విచారణను అక్టోబర్ 22కి కోర్టు వాయిదా వేసింది. భారత ప్రభుత్వం తీసుకుని వచ్చిన నూతన ఐటీ నిబంధనలను ప్రముఖ సోషల్ మీడియా సంస్థలు ఇప్పటికే అమలు చేస్తూ ఉన్నాయి. ఫేస్ బుక్ ఆధ్వర్యంలోని ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కూడా నూతన ఐటీ నిబంధనలను పాటిస్తూ భారతీయుల అకౌంట్లపై కఠినచర్యలు తీసుకుంది. అసభ్య కంటెంట్ ను డిలీట్ చేస్తూ ముందుకు వెళుతోంది.

    Trending Stories

    Related Stories