More

    క్లౌడ్ బరస్ట్ అంటే ఏంటో తెలుసా..? కేసీఆర్ కామెంట్స్ ఎంత వరకు కరెక్ట్..?

    తక్కువ పరిధిలో భారీ స్టాయిలో వరదలు రావడాన్ని క్లౌడ్ బరస్ట్ అంటారు. ఒక చిన్న ప్రాంతంలో…అంటే ఒకటి నుంచి పది కిలోమీటర్ల పరిధిలో ఎక్కువ వర్షం పడి…అంటే పది సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షం పడితే దాన్ని క్లౌడ్ బరస్ట్ అంటారు.

    ఒకే ప్రాంతంలో ఎన్ని సార్లు అయినా క్లౌడ్ బరస్ట్ జరగవచ్చు. భౌగోళిక, వాతావరణ పరిస్థితి మీద ఇది ఆధార పడి ఉంటుంది. అంతే కానీ ఒక దేశంపై ఇంకో దేశం చేసే అవకాశాలు లేవని వాతావరణ శాఖ అధికారులే చెబుతున్నారు. దేశంపై ఇతర దేశాలు కుట్రలు చేయడం వల్లే రాష్ట్రాలల్లో వరదలు వస్తున్నాయని సీఎం కేసీఆర్ అన్నారు.. దానిని క్లౌడ్ బరస్ట్ గా ఆయన అభివర్ణించారు. అయితే మే నుంచి ఆగస్ట్ వరకు మన దేశంలో క్లౌడ్ బరస్ట్ ఘటనలు జరిగే అవకాశం ఉంది. ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ తరహా ఘటనలు జరుగుతున్నాయి. రు

    తుపవనాలు దక్షిణాన ఉండే అరేబియా సముద్రం నుంచి కొంత తేమను తీసుకు రావడం అలాగే వెస్ట్రన్ డిస్టర్బెన్స్ కారణంగా మధ్యధరా తీరం నుంచి వీచే గాలులు పశ్చిమాన ఇరాన్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి తేమను తీసుకొస్తాయి. ఈ రెండు డీ కొన్నప్పుడు ఏర్పడిన మేఘాలకు ఎక్కువ సాంద్రత ఉండి… తక్కువ సమయంలో భారీ వర్షం పడుతుంది. కొండ ప్రాంతాల్లో మాత్రమే ఈ తరహా ఘటనలు జరుగుతాయి. దక్షిణ భారతదేశంలో మాత్రం ఇటువంటి ఘటనలకు అవకాశం లేదు. దీన్ని బట్టి చూస్తే తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు క్లౌడ్ బరస్ట్ కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం అవుతోంది.

    spot_img

    Trending Stories

    Related Stories