More

    బెంగాల్ ఎన్నికలపై సర్వే ఫలితాలేంటో తెలుసా?

    బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు అంతా రెడీ అయ్యింది. తొలి దశలో భాగంగా  30 నియోజకవర్గాలకు మార్చి 27వ తేదీన పోలింగ్ జరగనుంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ తోపాటు బీజేపీ, కాంగ్రెస్ నేతృత్వంలోని సంయుక్త మోర్చా పోటాపోటీగా ఎన్నికల ప్రచారం నిర్వహించాయి. మరోవైపు ఈ ఎన్నికల్లో పబ్లిక్ పల్స్ పట్టుకునేందుకు అనేక సర్వేలు…నేషనల్ మీడియా చానళ్లు రంగంలోకి దిగాయి. కొన్ని సర్వేలు తృణమూల్ కాంగ్రెస్ దే విజయమని చెబుతుండగా… ఇంకొన్ని సర్వేలు తృణమూల్ కాంగ్రెస్ కు అంత సీన్ లేదని చెబుతున్నాయి.

    బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో  తృణమూల్  కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరా హోరీ ఫైట్ ఉంటుందని మాత్రం దాదాపు అన్ని సర్వేలు ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. అదే సమయంలో పార్టీల వారిగా సాధించే సీట్ల సంఖ్యలో భారీ తేడాలను చూపిస్తున్నాయి. దీంతో జనం కూడా కాసింత కన్ఫ్యూజన్ కు గురవుతున్నారు. ఇక టైమ్స్ నౌ సీ ఓటర్ సర్వే మాత్రం హోరాహోరీ పోరులు చివరకు విజేతగా తృణమూల్ కాంగ్రెస్సే నిలుస్తుందని… మొత్తం 294 సీట్లకు గాను.. టీఎంసీ కి 152 నుంచి 168 సీట్లు వస్తాయని, బీజేపీకి 104 నుంచి 120 వరకు స్థానాలు వస్తాయని , అటు కాంగ్రెస్, లెఫ్ట్ ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ కూటమికి 18 నుంచి 26 సీట్లు వస్తాయని అంచనా వేసింది. రెండుస్థానాల్లో స్వతంత్రులు సైతం గెలిచే ఛాన్స్ ఉందని కూడా తెలిపింది. మార్చి 3వ వారంలో 18వేల మంది నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా టైమ్స్ నౌ సీ ఓటర్ ఈ ప్రిడిక్షన్స్ ఇచ్చినట్లు టైమ్స్ నౌ సీ ఓటర్ తెలిపింది.

    బెంగాల్ ఏ పార్టీ అయిన అధికారంలోకి రావాలంటే 147 సీట్లు అవసరం. ఈ మ్యాజిక్ ఫిగర్ ను తొలిసారిగా బీజేపీ సులభంగానే దాటేస్తుందని ఇండియా టీవీ న్యూస్ చానల్ లెక్కలు చెబుతోంది. బీజేపీ  ఈ ఎన్నికల్లో దాదాపుగా 183 స్థానాలను కైవం చేసుకుంటుందని, అదే సమయంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ కేవలం 95 స్థానాలకు మాత్రమే పరిమితం అవుతుందని, కాంగ్రెస్, వామపక్షాల కూటమి కూడా 16 స్థానాలు గెలుచుకుంటున్నాయని అంచనా వేసింది.

    2016 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ 211 స్థానాలను గెలుచుకుని తిరుగులేని విజయం సాధించింది. అయితే దాదాపు 10 ఏళ్ళపాటు తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోఉండటంతో… సహజ సిద్ధంగానే ప్రజాల్లో వ్యతిరేకత కనిపిస్తుందని, ఇది బీజేపీకి అనుకూలంగా మారిందని సర్వే సంస్థలు చెబుతున్నాయి. రెండు పార్టీల మధ్య ఓట్ల తేడా కూడా రెండు శాతమేనని, మమతా బలం ముస్లిం ఓట్లేనని అయితే ఇంతకాలం తృణమూల్ కు అండగా నిలిచిన అబ్బాస్ సిద్ధికీ కూడా కాంగ్రెస్, కమ్యూనిస్టులతో కలిసి బరిలోకి నిలబడటం, దీనికితోడు మరికొన్ని నియోజకవర్గాల్లో ఎంఐఎం పార్టీ కూడా పోటీ చేస్తుండంతో… ముస్లింల ఓట్లు ముందటిలాగా మమతా బెనర్జీకి గంపగుత్తాగా పడే అవకాశాలు లేవని విశ్లేషకులు చెబుతున్నారు.

    దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో మమతా బెనర్జీ సైతం హిందుత్వ కార్డును ఆశ్రయిస్తున్నారని, తనకు వచ్చిన శ్లోకాలను బహిరంగ సభల్లో పాడుతూ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. అలాగే కాలుకు పట్టుకుని ప్రచారం చేస్తూ…, ప్రజల్లో తనఎస్సీ,ఎస్టీలు, ఓబీసీలు సైతం ఈసారి బీజేపీ వైపు ఉన్నారని చెబుతున్నారు.

    అయితే సర్వే ఫలితాలేం చెప్పిన అసలు ఫలితాలు తెలియాలంటే మే 2వ తేదీ వరకు ఆగాల్సిందే.

    Trending Stories

    Related Stories