More

    దీదీ అనుకున్నదొక్కటి.. 8 రాష్ట్రాల సీఎంలు ఇచ్చిన ఝలక్ మరొకటి..!

    తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి, ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి బీజేపీ వ్యతిరేక వర్గాన్ని ఏకం చేయాలని భావించింది. ఢిల్లీలోని కాన్‌స్టిట్యూష‌న్ క్ల‌బ్‌లో బుధ‌వారం మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు ప్రారంభమైంది. ఈ భేటీకి రావాలంటూ దీదీ ఏకంగా 22 మంది జాతీయ స్థాయి నేత‌ల‌కు ఆహ్వానం పంపారు. ఆమె ఆహ్వానం పంపినా.. అక్కడికి వచ్చింది చాలా తక్కువ మంది నేతలే..! కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున ఈ భేటీకి మ‌ల్లికార్జున ఖ‌ర్గే, జైరాం ర‌మేశ్‌, ర‌ణ‌దీప్ సింగ్ సూర్జేవాలా హాజ‌ర‌య్యారు. వీరితో పాటు నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్ వ‌చ్చారు. స‌మాజ్‌వాదీ పార్టీ అధినేత, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాద‌వ్, శివ‌సేన నుంచి ఆ పార్టీ ఎంపీ ప్రియాంకా చ‌తుర్వేది హాజ‌ర‌య్యారు. జేడీఎస్ నుంచి మాజీ ప్ర‌ధాని హెచ్‌డీ దేవేగౌడ‌, క‌ర్ణాట‌క మాజీ సీఎం కుమార‌స్వామి, పీడీపీ నుంచి మెహ‌బూబా ముఫ్తీ, డీఎంకే నుంచి టీఆర్ బాలు, సీపీఐ నుంచి డి.రాజా త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. ఈ భేటీకి 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులను దీదీ ఆహ్వ‌నిస్తే ఒక్క ముఖ్య‌మంత్రి కూడా హాజ‌రవ్వలేదు.భేటీకి హాజ‌రైన నేత‌లంద‌రినీ బ‌య‌ట‌కు వ‌చ్చి మ‌రీ దీదీ ఆహ్వానించారు.

    spot_img

    Trending Stories

    Related Stories