National

వారానికి 10 కోట్ల కిట్ల తయారీ.. ప్రతి ఒక్కరికీ అందుబాటులో

టెస్టింగ్ లను వీలైనంత సులువుగా చేసుకోడానికి పూణేకు చెందిన మైల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్స్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే..! వారానికి 10 కోట్ల కిట్లను తయారు చేయబోతూ ఉన్నామని మై ల్యాబ్ సంస్థ తెలిపింది. నాలుగు-ఆరు వారాల వ్యవధిలో ఈ టెస్ట్ కిట్ల ఉత్పత్తిని వారానికి 10 కోట్లకు పెంచుతామని స్పష్టం చేసింది. డిమాండ్ ను బట్టి ఉత్పత్తిని కూడా భారీగా పెంచుతామని మైల్యాబ్ అధికారులు స్పష్టం చేశారు.

మైల్యాబ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాహుల్ పాటిల్ మాట్లాడుతూ.. రాబోయే వారాల్లో వారానికి 10మిలియన్ల కొవిసెల్ఫ్ కిట్లను ఉత్పత్తి చేయబోతున్నాం. తమకు తాముగా.. ఎవరికి వారే కరోనా టెస్ట్ చేసుకోవచ్చు. గ్రామాల దాకా కూడా ఈ టెస్ట్ కిట్లు వెళ్ళబోతూ ఉన్నాయి. దీంతో కరోనా ఉందో లేదో తెలుసుకోవడం పెద్ద కష్టం కాదని తెలిపారు. టెస్టుల్లో కరోనా ఉందని తెలియగానే తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

ఇంతకూ ఏమిటిది:

మైల్యాబ్ అనే సంస్థ తయారు చేసిన ‘కొవిసెల్ఫ్’ అనే స్వీయ ర్యాపిడ్ యాంటీ జెన్ కిట్ కు అనుమతులను ఇచ్చింది. దీనితో ర్యాపిడ్ టెస్ట్ ఫలితం వస్తుంది. లక్షణాలున్న వారు లేదా కరోనా సోకిన వారిని ఇటీవలే కలిసిన వారు టెస్ట్ చేసుకోవచ్చని ఐసీఎంఆర్ తెలిపింది. కేవలం మీరే మీ చేతులతో టెస్టును చేసుకోవచ్చు. దీన్నే ప్రామాణికంగా తీసుకోకుండా.. కరోనా లక్షణాలు ఉన్నా ఇందులో నెగటివ్ గా వస్తే మాత్రం ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి. సంస్థ టెస్ట్ కిట్ లోని యూజర్ మాన్యువల్ లో నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా పరీక్ష చేసుకోవాలి. టెస్టులు చేసుకునేవారంతా గూగుల్ ప్లే స్టోర్ నుంచి హోం టెస్టింగ్ మొబైల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుంటే.. అందులో పరీక్షా పద్ధతులకు సంబంధించిన పూర్తి వివరాలు ఆ యాప్ లో ఉంటాయి. పరీక్ష ఫలితాల్లో నెగెటివ్/పాజిటివ్ వచ్చిందనే విషయాన్ని తెలుసుకోవచ్చు. టెస్ట్ పూర్తయిన తర్వాత.. యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్న, టెస్ట్ చేసుకున్న వ్యక్తి రిజిస్టర్ చేసుకున్న మొబైల్ ఫోన్ లోనే ఆ టెస్ట్ పేపర్ ను ఒక ఫొటో తీసుకోవాలి. టెస్ట్ లో పాజిటివ్ వస్తే కరోనా ఉన్నట్టు.. ఒకవేళ లక్షణాలుండి నెగెటివ్ వస్తే కచ్చితంగా ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. పాజిటివ్ వచ్చి.. లక్షణాలు తక్కువగా ఉన్నవారు కేంద్ర ఆరోగ్య శాఖ మార్గనిర్దేశాల ప్రకారం ఇంట్లోనే ఐసోలేట్ అవ్వాల్సి ఉంటుంది.
లక్షణాలుండి యాంటీ జెన్ టెస్ట్ లో నెగెటివ్ వచ్చిన వారిని కరోనా అనుమానిత పేషెంట్ గానే భావించాలి. అలాంటి వారు ఇంట్లో ఐసోలేట్ అవ్వాలి. యాప్ లోని యూజర్ వివరాలు ఐసీఎంఆర్ కొవిడ్ 19 టెస్టింగ్ పోర్టల్ లో భద్రంగా దాస్తారు. టెస్ట్ అయిపోయిన తర్వాత సంస్థ నిర్దేశించిన ప్రమాణాల మేరకు ఆ కిట్ ను భద్రంగా పారేయాలి. ఒక్కో కిట్ లో అన్ని టెస్టింగ్ మెటీరియల్స్ కూడా ఉండాయి. బయో హజార్డ్ బ్యాగ్ ను ఉపయోగించి టెస్టింగ్ అయ్యాక కిట్ ను పారవేయాల్సి ఉంటుంది. కోవి సెల్ఫ్ లో 15 నిమిషాల్లో ఫలితం రానుంది. దీని ధర కంపెనీ 250 రూపాయలుగా నిర్ణయించింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

5 × one =

Back to top button