కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి పౌరస్మతిని త్వరలోనే తీసుకురాబోతుందా..? ఢిల్లీ నగరపాలక సంస్థ ఎన్నికల ప్రచారంలో.. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ వ్యాఖ్యలు గమనిస్తే నిజమేనమో.. అనిపిస్తోంది. కొద్దిరోజుల క్రితం యావత్ భారత దేశాన్నీ కుదిపేసిన ఢిల్లీ శ్రద్దా వాకర్ హత్య గురించి ప్రస్తావించిన బిశ్వ శర్మ.. యూనిఫాం సివిల్ కోడ్ తో పాటు లవ్ జీహాద్ కు వ్యతిరేకంగా చట్టాలు రావాలని కోరారు. అఫ్తాబ్ లాంటి దుర్మార్గులు మరింత మంది పుట్టుకురాకూడదంటే ఇటువంటి చట్టాలు అత్యవసరమని వ్యాఖ్యానించారు. దీంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం త్వరలో ఈ అంశాలపై చట్టాలను చేయబోతోందా..? అనే అనుమానాలు క్రమంగా బలపడుతున్నాయి. అయితే ఈ వ్యాఖ్యలు అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ చేయడం వెనుక కారణాలేంటో తెలుసుకుందాం. మిత్రులారా అంతకంటే ముందు మీరు చేయాల్సి పని గుర్తుంది కదా..! మన గ్రూపాఫ్ ఛానెల్స్ ను సబ్ స్క్రయిబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. పదిమందికీ ఈ వీడియోను షేర్ చేసి జాతీయవాద జర్నలిజానికి మద్దతు తెలపండి.
ఇక స్టోరీలోకి వెళితే,.. ట్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370 రద్దు, రామ మందిర నిర్మాణం, ఉమ్మడి పౌరస్మృతిని తీసుకురావడం వంటి కీలక సిద్ధాంతాల పునాదులపైనే బీజేపీ ఆవిర్భవించింది. అయితే, 2014 వరకు కొన్నాళ్లు జనతా పార్టీ,.. కొద్దిరోజులు నేషనల్ ఫ్రంట్ సర్కార్,.. ఒకసారి వాజ్ పేయి సర్కార్ మినహా బీజేపీకి కేంద్రంలో ఏనాడు అనుకూల ప్రభుత్వాలు లేవు. దీంతో కీలక చట్టాలను అమలు చేయలేకపోయింది. వాజ్ పేయి ప్రభుత్వం పూర్తికాలం అధికారంలో ఉన్నప్పటికీ.. నాడు దేశంలో అత్యవసరమైన మౌలిక వసతుల అభివృద్ధిపైనే దృష్టి పెట్టాల్సి వచ్చింది. దీంతో బీజేపీ తమ సిద్ధాంత పరమైన కీలక హామీలకు మోక్షం లభించలేదు. అయితే, అధికార కాంగ్రెస్ వారసత్వ ప్రభుత్వాలపై ఏనాడూ పోరాటాన్ని మాత్రం ఆపలేదు. ట్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370 రద్దు, ఉమ్మడి పౌరస్మృతి కోసం ఎన్నోసార్లు ఉద్యమాలు, నిరసనలతో ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నించించింది,.. సూడో సెక్యులర్ ప్రభుత్వం వీటిని పట్టించుకున్న పాపాన పోలేదు.ఎప్పుడైతే 2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో.. ఆ నాటి నుంచి బీజేపీ కీలక సిద్ధాంతాలపై దృష్టి సారించింది.అయితే, ఈ చట్టాలన్నీ మతపరమైన మనోభావాలతో కూడుకున్నవి కావడంతో వీటిని అమలు చేయాలంటే వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ముందుగా వీటిపై దేశవ్యాప్తంగా చర్చను లేవనెత్తి ఆ చర్చలో బీజేపీ వాదన బలంగా ఉండేటట్లు చూడాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాదు, వీటివల్ల ప్రజలకు కలిగే లాభ నష్టాలను వివరించిన తర్వాతే వీటన్నిటినీ అమలు చేయాల్సి ఉంటుంది. కాబట్టి బీజేపీ అధికారంలోకి వచ్చిన మొదటి ఐదేళ్ళలో వీటి జోలికి వెళ్ళకుండా ఉండటమే మేలని భావించింది. ఈ ఐదేళ్ళు కూడా సందర్భానుసారంగా ఈ అంశాలపై చర్చను లేవనెత్తి ప్రజల్లో వీటివల్ల కలిగే నష్టాలను తెలిపే ప్రయత్నం చేసింది బీజేపీ.
అయితే రెండవసారి అధికారంలోకి రాగానే ఈ చట్టాలను ఒక్కొక్కటిగా పార్లమెంటులో ఆమోదం చేసింది బీజేపీ. ఇందులో ట్రిపుల్ తలాక్ రద్దు, రామ్ మందిర్, ఆర్టికల్ 370 రద్దును ఇప్పటికే అమల్లోకి తెచ్చింది. ఇక మిగిలింది యూనిఫాం సివిల్ కోడ్ ఒక్కటే.. అయితే దీనికి తాజాగా లవ్ జీహాద్ చట్టం కూడా తోడైనట్లు కనిపిస్తోంది. రానురానూ లవ్ జీహాద్ ఘటనలు పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తుండటంతో దీనిపై కూడా చట్టం చేయాలని బీజేపీ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇక ఈ రెండు చట్టాలను కూడా అమలు చేసేందుకు బీజేపీ సమాయత్తమవుతోందా..? అనే అనుమానాలు అందరిలోనూ మొదలైంది. అయితే ఇప్పటికే అన్ని చట్టాలనూ అమలు చేసినా ఒక్క యూసీసీనే ఎందుకు బీజేపీ ప్రభుత్వం జాప్యం చేస్తోందనే అనుమానాలు అందరిలోనూ నెలకొన్నాయి. దీనికి కారణమూ లేకపోలేదు. ఇప్పటివరకూ చేసిన ట్రిపుల్ తలాక్ రద్దు, ఆర్టికల్ 370 రద్దు, రామ్ మందిర్ లలో కేవలం ఒక వర్గమో లేక ఒక ప్రాంతం వారో ప్రభావితం అవుతారు కాబట్టి.. కాస్త సులభంగానే గట్టెక్కాయి. కానీ యూనిఫాం సివిల్ కోడ్ వల్ల యావత్ భారత దేశ ప్రజలందరూ ప్రభావితమవుతారు. అటు మైనార్టీలే కాకుండా హిందువుల్లోని కొన్ని వర్గాలు కూడా ప్రభావితమయ్యే అవకాశముంది. అందుకే ఈ చట్టాన్ని అందరూ ఒప్పుకునేవరకూ వేచి ఉండాల్సిన అవసరం ఉంది. దీంతో పాటు యూసీసీపై సాధారణ ప్రజల్లో సరైన అవగాహన రాకపోతే దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశమూ లేకపోలేదు.
ఇటువంటి పరిస్థితిని బీజేపీ గతంలోనే ఎదుర్కొంది. గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు చట్టాలు కూడా దేశంలోని రైతులందరికీ మేలు చేసేవే అయినప్పటికీ.. ఈ చట్టాల వల్ల రైతుల ఆదాయం పెరిగే అవకాశమేర్పడుతుంది. దీంతోపాటు ఇప్పటివరకూ కేవలం వ్యవసాయ మార్కెట్ లలో మాత్రమే అమ్ముకోవాల్సిన వ్యవసాయ ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా అమ్ముకునేందుకు వీలు కల్పిస్తూ ఈ చట్టాలను రూపొందించారు. అయితే ఈ చట్టాలనుంచి రైతులు పొందే లాభాలను ప్రజలకు బీజేపీ సరిగ్గా వివరించలేకపోయింది. ఉన్నపళంగా చట్టాలను తీసుకురావడం వల్ల ఈ చట్టాలపై సుప్రీం కోర్టు సైతం స్టే విధించింది. అంతేకాదు, వేలాదిమంది పంజాబ్ హర్యానా రైతులు ఢిల్లీ శివార్లలో రోడ్లను బ్లాక్ చేస్తూ నెలల తరబడీ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దీంతో ఇక ఏమీ చేయలేని పరిస్థితుల్లో బీజేపీ ఈ చట్టాలను వెనక్కు తీసుకోవాల్సి వచ్చింది. ఈ చట్టాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న సమయంలో తాము వ్యవసాయ చట్టాల గురించి ప్రజలకు నచ్చజెప్పడంలో విఫలం చెందామని దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఒప్పుకున్నారు.
అందుకే ఇటువంటి ఇబ్బందులు మరోసారి జరగకుండా ఉండాలంటే ఈ చట్టాలపై ప్రజల్లో పూర్తిగా అవగాహన ఏర్పరచవలసిన అవసరముంది. కాస్తంత ఆలస్యమైనా కూడా ప్రజలందరికీ పూర్తిగా అవగాహన కల్పించినప్పుడే ఏదైనా చట్టాలను అమలు చేయడానికి వీలవుతుంది. అందుకే సందర్భానుసారంగా వీటిపై చర్చను లేవనెత్తడానికి బీజేపీ నాయకులందరూ ప్రయత్నిస్తున్నారు. ఈ విధంగా పూర్తి చర్చ జరిపి దేశ ప్రజల్లో పూర్తి అవగాహన వచ్చిందనుకున్న తర్వాత వీటిని ఎప్పటికైనా రద్దు చేసే అవకాశం ఉంటుంది.