రైలు ప్రమాదం జరిగితే ప్రాణాలకు అయితే గ్యారెంటీ ఉండదు. అలాగే రైలు పట్టాలు దాటేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో అనేక ఘటనలు మనకు తెలియజేశాయి. కళ్లు మూసి తెరిచే లోపు ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి.
అయినా కూడా కొందరు రైలు పట్టాలపై నిర్లక్ష్యం దాటుతూ ప్రాణాలు పోగోట్టుకుంటున్నారు. అయితే ఇక్కడ అలాంటి ఘటన జరిగినా.. అలాంటి ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకుంది ఓ మహిళ. ట్రైన్ వచ్చేది గమనించక.. తన సామగ్రితో పట్టాలు దాటి మళ్లీ తిరిగి వచ్చేందుకు ప్రయత్నించింది. ఆ సమయంలోనే ట్రైన్ దూసుకొచ్చింది. ప్రస్తుతం ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఐఏఎస్ అధికారి అవనీశ్ శరన్ ఈ దృశ్యాలను ట్విట్టర్‌లో షేర్ చేశారు.‘ఈ జీవితం మీది.. నిర్ణయమూ మీదే’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఆ వీడియోలో.. స్టేషన్‌కు ముందే నిలిపేసిన ట్రైన్ నుంచి కొందరు ప్రయాణికులు దిగి వెళ్లేందుకు ప్రయత్నించారు.
వీడియో తీస్తున్న వ్యక్తి పక్క ట్రాక్‌పై మరో ట్రైన్ వస్తుందని చెబుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే ఓ కుటుంబ సభ్యుల్లో భయాందోళన నెలకొంది. పట్టాలకు అవతలివైపు తమ లగేజీని పడేసిన ఓ మహిళ మళ్లీ తిరిగి ఈ వైపునకు వచ్చే ప్రయత్నం చేసింది. రెప్పపాటులో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది.