More

    హిందూ మతం స్వీకరించిన యూపీ షియా వక్ఫ్ బోర్డు మాజీ చీఫ్ వసీం రిజ్వీ

    ఉత్తరప్రదేశ్ షియా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ వసీం రిజ్వీ ఇస్లాం మతాన్ని వీడి అధికారికంగా హిందూ మతంలోకి మారారు. సోమవారం ఉదయం 10:30గంటల సమయంలో ఘజియాబాద్ లోని దస్నా దేవీ ఆలయ ప్రధాన పూజారి నరసింగానంద్ సరస్వతి సమక్షంలో యగ్నం నిర్వహించిన తర్వాత అధికారికంగా హిందూ మతంలోకి మారారు వసీం రజ్వీ. వసీం రిజ్వీ ఇస్లాం మతాన్ని త్యజించి హిందూ మతాన్ని స్వీకరించారు. రిజ్వీని తరచుగా ఛాందసవాదులు లక్ష్యంగా చేసుకున్నారు. దీంతో ఘజియాబాద్‌లోని దాస్నా దేవి ఆలయంలో మహంత్ యతి నరసింహానంద గిరి సమక్షంలో హిందూ మతంలోకి మారారు. రిజ్వీ తన పూర్వీకుల మతంలోకి తిరిగి స్వాగతించబడ్డారు, ఆ తర్వాత ఆయనకు జితేంద్ర నారాయణ స్వామి అని పేరు పెట్టారు. ఆచారంలో భాగంగా దాస్నా దేవి ఆలయంలో ప్రతిష్టించిన శివలింగానికి పాలు సమర్పించారు రజ్వీ. హిందూ మతంలోకి మారిన నేపథ్యంలో ఆయన పేరు కూడా మారింది. త్యాగి కమ్యూనిటీతో ఆయన అనుంబంధం కలిగి ఉండనున్నా రు.

    Wasim Rizvi, former chairman of Shia Waqf Board accepts Sanatan Dharma

    జితేంద్ర నారాయణ్ సింగ్ త్యాగి మాట్లాడుతూ.. మొఘలులు హిందువులను ఓడించే సంప్రదాయాన్ని తీసుకుని వచ్చారు. హిందువులను ఓడించే పార్టీకి ముస్లింలు ఏకగ్రీవంగా ఓటు వేస్తారు. నేను ఇస్లాం నుండి తొలగించబడ్డాను. ప్రతి శుక్రవారం, వారు నా తలపై మరిన్ని రివార్డులు ప్రకటిస్తారు. ఈ రోజు నేను సనాతన ధర్మాన్ని అంగీకరిస్తున్నాను అని తెలిపారు. హిందూయిజం ప్రపంచంలోని స్వచ్ఛమైన మతం. 1992లో ఇదే రోజున బాబ్రీ మసీదు కూల్చివేయబడినందున హిందూ మతంలోకి మారడానికి ఇదే డిసెంబర్ 6 పవిత్రమైన రోజుని నేను ఎంచుకున్నాను. నేను ఈ రోజు నుండి హిందూ మతం కోసం పని చేస్తానని తెలిపారు. తన మృతదేహాన్ని సంప్రదాయ హిందూ ఆచారాల ప్రకారం దహనం చేయాలని, మరణం తర్వాత ఖననం చేయకూడదని వసీం రిజ్వీ తన వీలునామాలో పేర్కొన్నారు. తన అంత్యక్రియల చితికి ఘజియాబాద్‌లోని దాస్నా దేవాలయానికి చెందిన హిందూ ధర్మకర్త నరసింగానంద్ సరస్వతి నిప్పంటించాలని కూడా రిజ్వీ చెప్పుకొచ్చారు.

    Shia Waqf Board former chairman Waseem Rizvi converts into Hindu religion  Will join the Tyagi fraternity - शिया वक्फ बोर्ड के अध्यक्ष रहे वसीम रिजवी  ने अपनाया हिंदू धर्म, अब त्यागी बिरादरी

    సోమవారం సనాతన ధర్మాన్ని స్వీకరిస్తున్నట్లు రిజ్వీ కొద్దిరోజుల కిందట ప్రకటించారు. ఆయన చాలా రోజులుగా ఆలయ మహంత్‌తో క్రమం తప్పకుండా టచ్‌లో ఉన్నారు. తాను ఎప్పుడు చనిపోయినా దహన సంస్కారాలు చేయాల్సిందేనని కొన్ని రోజుల క్రితం తన కోరికను వ్యక్తం చేశారు. రిజ్వీ మరణించిన తర్వాత అతని మృతదేహానికి స్మశాన వాటికలో చోటు ఇవ్వబోమని ఛాందసవాదులు ప్రకటించారని అన్నారు. దేశంలో అశాంతి ఉండకూడదని, అందుకే దహన సంస్కారాలు చేయాలని ఇష్టానుసారం పాతిపెట్టకూడదని అన్నారు. హిందూ ఆచారాల ప్రకారమే అంత్యక్రియలు నిర్వహించాలని, ఈ నేపధ్యంలో దానికి సంబంధించిన కాపీని అడ్మినిస్ట్రేషన్‌కు కూడా పంపాలని ఆయన అన్నారు.

    గత నెల 4వ తేదీన వసీం రిజ్వీ ఘజియాబాద్ లోని దస్నా దేవీ ఆలయంలో నరసింగానంద్ సరస్వతి సమక్షంలో విడుదల చేసిన ఓ బుక్ పై ముస్లిం కమ్యూనిటీ నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమైన విషయం తెలిసిందే. ఆ బుక్ కవర్ పేజీపై అర్థనగ్నంగా ఉన్న మహిళతో ఓ వ్యక్తి ఉన్న చిత్రం ఉండటంపై చాలా మంది ముస్లిం పెద్దలు,ఆల్ ఇండియా షియా లా బోర్డ్ సహా పలు ముస్లిం ఆర్గనైజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వసీం రిజ్వీ ప్రవక్తను అవమానించేలా వ్యాఖ్యలు చేశారంటూ ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ నవంబర్ 17న తన పార్టీ నేతలతో కలిసి హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ ను కలిసి ఫిర్యాదు చేశారు. ఇస్లాం,దానిని పాటించేవారిని అవమానించేలా అభ్యంతరకర పదజాలాన్ని ఉపయోగించారని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌కు చేసిన ఫిర్యాదులో ఓవైసీ ఆరోపించారు.

    Trending Stories

    Related Stories