International

నేను ముందు నుండీ చెబుతోంది అదే కదా: ట్రంప్

డొనాల్డ్ ట్రంప్.. కరోనా మహమ్మారి చైనాలోనే పుట్టిందని అమెరికా మాజీ అధ్యక్షుడు ముందు నుండి చెబుతూనే ఉన్నారు. చైనీస్ వైరస్ అంటూ బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. చైనా కరోనా వైరస్ ను ల్యాబ్ లోనే తయారు చేసిందని.. ఇందుకు ప్రపంచ దేశాలకు భారీగా డబ్బులు కట్టాలని డిమాండ్ చేశారు. కానీ అప్పట్లో ఆయనకు ఎవరూ పెద్దగా మద్దతు ఇవ్వలేదు. కానీ రాను రానూ కరోనా వైరస్ చైనాలో తయారైందనే వాదనలు బలపడుతూ ఉన్నాయి. ఇప్పటికే ఎన్నో లీకులు కూడా అందాయి. ముఖ్యంగా కరోనా వైరస్ కేసు గురించి చైనా అధికారికంగా ప్రకటించకముందే వుహాన్ ల్యాబ్ లో పని చేసే వారిలో కరోనా లక్షణాలు సోకడం.. వారు ఆసుపత్రుల్లో చికిత్స పొందడం వంటివి బయటకు తెలియడంతో మరో సారి డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు నిజమేనని పలువురు చెబుతూ ఉన్నారు. అప్పట్లో కొందరు డొనాల్డ్ ట్రంప్ ను ఈ విషయమై విమర్శించగా.. వాళ్ళే ఇప్పుడు సమర్థిస్తూ వస్తున్నారు.

తాజాగా డొనాల్డ్ ట్రంప్ చైనీస్ వైరస్ వివాదంపై మరోసారి స్పందించారు. చైనీస్ వైరస్ పుట్టుక గురించి తాను చెప్పిందే నిజమైందని.. క‌రోనాను వూహాన్‌ ల్యాబ్‌లో శాస్త్ర‌వేత్త‌లే సృష్టించారని ఇటీవల పలు అధ్యయనాలు చెప్పిన విష‌యాల‌ను గుర్తు చేశారు. క‌రోనాను సృష్టించి ప్ర‌పంచాన్ని ఇంత‌టి సంక్షోభంలోకి నెట్టేసిన చైనా భారీగా జ‌రిమానా చెల్లించాలని డిమాండ్ చేశారు. తాను అప్ప‌ట్లో చెప్పింది ఇప్పుడు కొంద‌రు శత్రువులు స‌హా ప్రతి ఒక్కరూ అంటున్నారని.. ప్ర‌పంచ వ్యాప్తంగా మరణాలు, విధ్వంసానికి కారణమైన చైనా త‌మ దేశంతో పాటు ప్రపంచానికి మొత్తం 10 ట్రిలియన్‌ డాలర్లు చెల్లించాలని ట్రంప్ డిమాండ్ చేశారు. క‌రోనాను చైనా ఉద్దేశ‌పూర్వ‌కంగానే సృష్టించింద‌ని, చైనా పరిశోధనల ఫలితంగా అది వ్యాప్తి చెందింద‌ని అమెరికా ఇంటెలిజెన్స్ తో పాటూ, బ్రిటన్ ప‌రిశోధ‌కులు కూడా తెలిపింది.

వుహాన్ ల్యాబ్ లో చైనా కరోనా వైరస్ ను పుట్టించిందనడానికి ఎన్నో సాక్ష్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. అమెరికా ఇంటలిజెన్స్ నివేదికల ఆధారంగానే.. ఇటీవల ప్రముఖ ఆంగ్ల పత్రిక వాల్ స్ట్రీట్ జనరల్ ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో కరోనా వైరస్ వూహాన్ ల్యాబ్ లో పుట్టిందనడానికి సాక్ష్యాధారాలను వివరించింది. అమెరికా స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ ఫాక్ట్‌ షీట్‌లోని కొన్ని విషయాలు బయటపెట్టింది. కరోనా సోకి ఆసుపత్రి పాలైన మొదటి రిపోర్టు డిసెంబర్ 8, 2019న వుహాన్ లో నమోదైనట్టు వుంది. అంటే, అంతకు ముందే కరోనా లక్షణాలు వుహాన్ ల్యాబ్ లో పని చేసే శాస్త్రవేత్తల్లో ఉన్నాయి. ఇక 2015లోనే కరోనా వైరస్ ను బయోవార్ లో భాగంగానే కమ్యూనిస్టు కంట్రీ చైనా కరోనా వైరస్ ను సృష్టించినట్టు.. ఆస్ట్రేలియాకు చెందిన ఓ రీసెర్చ్ పేపర్ ఆధారాలతో సహా బయటపెట్టింది. కరోనా వైరస్ 2019 డిసెంబర్ లో బయటికి వచ్చినట్టు ప్రపంచం నమ్ముతోంది. కానీ, అంతకు నాలుగేళ్ల ముందే ఈ వైరస్ వెలుగుచూసినట్టు ఈ రీసెర్చ్ పేపర్ చెబుతోంది. కరోనా వైరస్ ను బయోలాజికల్ వెపన్ గా ఉపయోగించి.. ప్రపంచ నెంబర్ వన్ గా ఎదగాలన్న చైనా కుట్రను రీసెర్చ్ పేపర్ బట్టబయలు చేసింది. కరోనా వైరస్ జీవ ఆయుధాల యొక్క కొత్త శకానికి దారితీస్తుందని చైనా శాస్త్రవేత్తలు రీసెర్చ్ పేపర్‎లో రాసుకున్నారు. ఈ కథనాన్ని ప్రచురించిన ఆస్ట్రేలియా ప్రత్రిక మరో విషయాన్ని కూడా వెల్లడించింది. ఈ రీసెర్చ్ పేపర్ తాము చెప్పిన విషయాలు.. అమెరికా ఇంటలిజెన్స్ వర్గాల వద్ద కూడా వున్నాయని తెలిపింది.

వైరస్ గురించి కూడా చైనా ప్రభుత్వం ప్రపంచానికి మొదటి నుండి అబద్ధాలే చెబుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఆలస్యంగా చెప్పడమే కాకుండా,.. వైరస్ పై పరిశోధన చేసేందుకు ప్రయత్నించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ సభ్యులకు అడుగడుగునా ఆటంకాలు సృష్టించింది. ఇప్పుడు అమెరికా, ఆస్ట్రేలియా ఇంటలిజెన్స్ పరిశోధనలతో చైనా వైరస్ ను సృష్టించిందనే విషయం స్పష్టంగా తెలుస్తూ ఉండగా.. డొనాల్డ్ ట్రంప్ మరోసారి తాను చెప్పిన విషయం నిజమేనని చెబుతున్నారు. అనవసరంగా అందరూ ట్రంప్ ను అపార్థం చేసుకున్నారనే చర్చ కూడా ప్రస్తుతం జరుగుతోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

three × 3 =

Back to top button