More

  మహమ్మారి ప్రబలకముందే వ్యాక్సిన్ ను చైనా తయారు చేసి పెట్టుకుందా..?

  కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచం మొత్తం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంది. చైనాలో పుట్టిన ఈ వైరస్ ను కట్టడి చేయడానికి చాలా దేశాలు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. వ్యాక్సిన్లను ప్రజలకు ఇవ్వడానికి సర్వ శక్తులను ఒడ్డుతూ ఉన్నాయి. చైనా మొదటి నుండి కరోనా కరోనా మహమ్మారి విషయంలో చాలా విషయాలనే దాచిందని ఎన్నో రిపోర్టులు చెబుతూ ఉన్నాయి. చైనా వైరస్ ను బయో వెపన్ గా మార్చాలని అనుకుందని.. చైనాలో అధికారికంగా కరోనా కేసులు నమోదవ్వకముందే వుహాన్ ల్యాబ్ లో ఉన్న సైంటిస్ట్ లకు కరోనా లక్షణాలు కనిపించాయనే ఇంటెలిజెన్స్ రిపోర్టులు రావడం వంటివి చైనా ప్రభుత్వం ప్రపంచానికి పెద్ద ముప్పును తీసుకుని వచ్చిందని స్పష్టంగా అర్థమవుతోంది.

  ఇక కరోనా మహమ్మారి ప్రబలక ముందే చైనా వ్యాక్సిన్ ను తయారు చేసిందా..? అనే అనుమానాలు కూడా బలపడుతూ ఉన్నాయి. ఒక మహమ్మారినిప్రపంచం మీదకు వదిలిన చైనా.. ఇప్పటి వరకూ 37.54 లక్షల మంది ప్రాణాలు పోడానికి , ప్రపంచవ్యాప్తంగా 17.44 కోట్ల మందికి పైగా సోకడానికి కారణమైంది. వుహాన్ ప్రయోగశాలలోనే కరోనా మహమ్మారి తయారైందని.. చైనా అప్పటికే టీకా కూడా తయారు చేసి ఉండవచ్చని భారత్ కు చెందిన ఒక ప్రముఖ భారతీయ వైరాలజిస్ట్ చెబుతున్నారు. వైరస్ లీక్ జరిగితే సిద్ధంగా ఉండడానికి ముందుగానే టీకా తయారుచేసి పెట్టుకుని ఉండవచ్చని అంటున్నారు. ప్రపంచంలో అత్యధిక జనాభా 140 కోట్లతో ఉన్న చైనా, 2019 డిసెంబర్ నుండి కేవలం 91,300 కోవిడ్-పాజిటివ్ కేసులు మరియు 4,636 మరణాలను నమోదు చేసింది. కరోనా కేసులు నమోదైన దేశాల జాబితాలో 98 వ స్థానంలో ఉంది.

  వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీ మాజీ ప్రొఫెసర్ & క్లినికల్ వైరాలజీ విభాగాధిపతి డాక్టర్ టి జాకబ్ జాన్ మాట్లాడుతూ “చైనీస్ ఎపిసోడ్ (వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నుండి అనుమానాస్పద లీక్) గురించి కొన్ని రహస్యాలు ఉన్నాయి. చైనా రూపొందించిన కోవిడ్ -19 మహమ్మారి ప్రపంచంలో ప్రత్యేకమైనది. చైనీయులు ఏదో దాచారు… లేదా చైనా ముందుగానే దీనికి సిద్ధమైంది. అంతా చాలా వరకూ దాచినట్లు తెలుస్తోంది. కరోనా మహమ్మారి పుట్టిన రెండు నెలలకే ఫిబ్రవరి 24, 2020 నాటికి SARS-CoV-2 వ్యాక్సిన్ కోసం లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్న ఒక యువ చైనా శాస్త్రవేత్త గురించి తెలిపారు. కేవలం రెండు నెలల్లో టీకాను తీసుకొచ్చారంటే.. వారు కనీసం ఒక సంవత్సరం ముందే వ్యాక్సిన్ తయారీ ప్రారంభించి ఉండాలి”అని చెప్పుకొచ్చారు.

  ఆశ్చర్యకరంగా వ్యాక్సిన్ కోసం దరఖాస్తు చేసిన ఆ యువకుడు (శాస్త్రవేత్త) చనిపోయాడు. ఇదే ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. ఏ నేరస్థుడైనా నేరాన్ని కప్పిపుచ్చినట్లే.. చైనా ఏదో కప్పిపుచ్చుకుంటున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. డాక్టర్ టి జాకబ్ జాన్ మాట్లాడుతూ, “మాలిక్యులర్ బయాలజీ ప్రకారం వైరస్ లో స్మోకింగ్ గన్ ఆధారాలు ఉన్నాయి.. ఇది ల్యాబ్ లో తయారు చేసిన వైరస్ అని సూచిస్తుంది.” అని తెలిపారు.

  కుసుమా స్కూల్ ఆఫ్ బయోలాజికల్ సైన్సెస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) ఢిల్లీకి చెందిన భారతీయ జీవశాస్త్రవేత్తలు SARS-CoV-2 వైరస్ యొక్క స్పైక్ ప్రోటీన్‌లో నాలుగు జీన్ ఇన్సర్షన్ లను కనుగొన్నారు. మానవ కణాలకు అటాచ్ చేయడానికి.. శరీరంలోకి ప్రవేశించడానికి దోహదపడుతుందని గుర్తించారు. ఇలా ఎన్నో ఆధారాలు చైనా ల్యాబ్ లోనే కరోనా వైరస్ ను సృష్టించారనే వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. యుఎస్ ప్రభుత్వం మొదటి నుండి వుహాన్ ప్రయోగశాల నుండి వైరస్ లీక్ పై సమగ్రంగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని చెబుతూ ఉంది.

  Trending Stories

  Related Stories