More

    అన్ని వేరియంట్లపై ప్రభావం చూపుతున్న వార్మ్ వ్యాక్సిన్

    సాధారణంగా వ్యాక్సిన్లను తయారు చేయడం ఒక ఎత్తైతే.. అదే వ్యాక్సిన్లను నిల్వ చేయడం మరో ఎత్తు..! అందుకే వార్మ్ వ్యాక్సిన్లను తీసుకుని వచ్చే దిశగా భారత్, ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. అంతేకాకుండా ఇందులో వారు సక్సెస్ కూడా అయినట్లు తెలుస్తోంది. అన్ని రకాల కరోనా వైరస్‌లపై ఇవి సమర్థంగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. భారత్‌కు చెందిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్, మైన్‌వ్యాక్స్‌ అనే బయోటెక్‌ సంస్థ ఈ టీకాలను అభివృద్ధి చేశాయి. వీటి సామర్థ్యంపై ఆస్ట్రేలియా ప్రభుత్వ ఆధ్వర్యంలోని కామన్‌వెల్త్‌ శాస్త్ర, పారిశ్రామిక పరిశోధన సంస్థ (సీఎస్‌ఐఆర్‌వో) కరోనాలోని అన్ని వేరియంట్లపై వీటిని పరీక్షించి చూసింది.

    ఇప్ప‌టి వ‌ర‌కు అందుబాటులో ఉన్న టీకాల‌ను శీత‌లీక‌ర‌ణ గ‌డ్డంగుల్లో భ‌ద్ర‌ప‌ర‌చాల్సిన టీకాలే. ఇండియాలో అందుబాటులో ఉన్న కోవాగ్జిన్‌, కోవీషీల్డ్ టీకాలు 2నుంచి 8 డిగ్రీల వ‌ర‌కు ఫ్రీజింగ్ చేయాలి. ఫైజ‌ర్‌, మోడెర్నా టీకాల‌ను మైన‌స్ 70 డిగ్రీల వ‌ద్ధ స్టోర్ చేయాలి. చాలా దేశాల్లో ఈ ఫ్రీజింగ్ పద్ధతులు కష్టతరమే..! అందుకే వార్మ్ వ్యాక్సిన్లు ఒక ట్రెండ్ సెట్టర్ గా మారనున్నాయి.

    ఈ టీకాలు ఎలుకల్లో బలమైన రోగనిరోధక స్పందనలను కలిగించాయట. హ్యామస్టర్స్‌కు గట్టి రక్షణ కల్పించాయని వెల్లడైంది. 37 డిగ్రీల సెల్సియస్‌ వద్ద కూడా ఈ టీకాలు నెల రోజుల పాటు చెక్కు చెదరకుండా ఉన్నాయని తెలుసుకున్నారు. 100 డిగ్రీల సెల్సియస్‌ వద్ద 90 నిమిషాల వరకూ అవి దెబ్బతినకుండా ఉన్నాయని తేలింది. ఈ టీకాల వల్ల కరోనాలోని ఆల్ఫా, బీటా, గామా, డెల్టా వేరియంట్లను సమర్థంగా అడ్డుకునే యాంటీబాడీలు ఉత్పత్తవుతున్నట్లు పరిశోధనలో తేలింది. మైన్‌వ్యాక్స్‌ రూపొందించిన అనేక టీకా ఫార్ములేషన్లను తాము జంతువులపై పరీక్షించామని, వీటిలో మానవ ప్రయోగాలకు అనువైన వ్యాక్సిన్‌ను గుర్తించడానికి ఇది దోహదపడిందని నిపుణులు చెప్పారు. భారత్‌లో త్వరలో క్లినికల్‌ ప్రయోగాలు జరగనున్నాయి.

    Trending Stories

    Related Stories