More

    వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల పేర్లు మార్చిన తెలంగాణ ప్రభుత్వం

    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాలను హన్మకొండ, వరంగల్ జిల్లాలుగా మార్చుతూ తెలంగాణ ప్రభుత్వం ఈరోజు జీవో జారీ చేసింది. 12 మండలాలతో హన్మకొండ జిల్లా, 15 మండలాలతో వరంగల్ జిల్లాను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కొత్త గా ఏర్పాడే హన్మకొండ జిల్లాలో 12 రెవెన్యూ మండలాలు, 139 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అలాగే వరంగల్ జిల్లాలో 15 రెవెన్యూ మండలాలు, 217 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. రెండు రెవెన్యూ డివిజన్లు, ఆరు నియోజకవర్గాలతో హన్మకొండ జిల్లా ఏర్పడింది.

    హన్మకొండ జిల్లాలో హ‌న్మ‌కొండ‌, కాజీపేట‌, ఐన‌వోలు, హ‌స‌న్‌ప‌ర్తి, వేలేరు, ధ‌ర్మ‌సాగ‌ర్‌, ఎల్క‌తుర్తి, భీమ‌దేవ‌ర‌ప‌ల్లి, క‌మాలాపూర్‌, ప‌ర‌కాల‌, న‌డికూడ‌, దామెర‌, ఆత్మ‌కూరు, శాయంపేట‌ మండలాలు ఉన్నాయి. వరంగల్ జిల్లాలో వ‌రంగ‌ల్‌, ఖిల్లా వ‌రంగ‌ల్‌, గీసుగొండ‌, వ‌ర్ధ‌న్న‌పేట‌, రాయ‌ప‌ర్తి, ప‌ర్వ‌త‌గిరి, సంగెం, న‌ర్సంపేట‌, చెన్నారావుపేట‌, న‌ల్ల‌బెల్లి, దుగ్గొండి, ఖానాపూర్‌, నెక్కొండ‌ మండలాలు ఉన్నాయి.

    Trending Stories

    Related Stories