అబ్దుల్ వహాబ్ కాస్తా దేశ్రాజ్ గౌతమ్ గా పేరు మార్చుకున్నాడు.. అమ్మాయిని నమ్మించి

ఉత్తరప్రదేశ్ జిల్లా బారాబంకి జిల్లా కుర్సీ పోలీస్ స్టేషన్ పరిధిలోని అమర్సంద గ్రామంలో హిందూ అని చెప్పి అమ్మాయిని మోసం చేసిన ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. అబ్దుల్ వహాబ్ అయిన ఆ వ్యక్తి తనను తాను దేశ్రాజ్ గౌతమ్ అని చెప్పి హిందూ అమ్మాయిని ఆకర్షించాడు. ఆమెను ప్రేమ ముగ్గులోకి దింపాడు. ఆమెను అభ్యంతరకరమైన వీడియోలను తీశాడు. మతం మారి తనను పెళ్లి చేసుకోవాలని లేదంటే అభ్యంతకర వీడియోలను బయట పెడతానంటూ బ్లాక్ మెయిల్ చేస్తూ వచ్చాడు. ఈ విషయం బరాబంకి పోలీసులకు తెలియడంతో నిందితులను అరెస్టు చేశారు.
బారాబంకి పోలీసు సూపరింటెండెంట్ అవధేష్ సింగ్ మాట్లాడుతూ.. ‘అమ్మాయి తండ్రి నిందితులపై ఫిర్యాదు చేశాడు. సదరు ముస్లిం యువకుడు రెండేళ్ల క్రితం రైతు భూమిని సాగు చేయడం ప్రారంభించారని ఫిర్యాదులో తెలిపాడు. నిందితుడు తన గుర్తింపును రహస్యంగా ఉంచి, అతని పేరు దేశరాజ్ గౌతమ్ అని చెప్పుకొచ్చాడట. అతను తన సోదరుడిని హన్స్రాజ్గా కూడా వాళ్లకు పరిచయం అయ్యాడు’. ఆ తర్వాతే ఆ అమ్మాయిని పరిచయం చేసుకుని మాయ మాటలు చెప్పినట్లు ఫిర్యాదులో తెలిపారు.
వహాబ్ రైతు ఇంటిని సందర్శిస్తూ అతడి కుమార్తెను ఆకర్షించాడు. ఒక రోజు అతను ఆమెపై అత్యాచారం చేసి వీడియో చేశాడు. అప్పటి నుండి వహాబ్ అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేయడానికి ఆ వీడియోలను ఉపయోగించాడు. అతను ఆమెను ఇస్లాం మతంలోకి మారాలని, తనని వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేశాడు. అతని డిమాండ్లను అంగీకరించడానికి అమ్మాయి నిరాకరించడంతో అతను జూన్ 20 న అమ్మాయిని కిడ్నాప్ చేశాడు. జూన్ 23 న, అమ్మాయి బంధువుల ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దేవన్ కొత్వాలి ప్రాంతంలోని పీడ్ విలేజ్ లోని అబ్దుల్ రషీద్ ఇంటిలో ఆమె ఉండడాన్ని గుర్తించారు. పోలీసులు నిందితుడు వహాబ్ను కూడా అరెస్టు చేశారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్న తరువాత, వారి వివాహం విషయం వెలుగులోకి వచ్చింది. వహాబ్ వివాహ కమిటీ ధృవీకరణ పత్రాన్ని చూపించాడు, అందులో బాధితురాలి పేరును సిమ్రాన్ గా మార్చబడింది. సర్టిఫికెట్లో వివాహం జరిగిన తేదీ మార్చి 15, 2020 అని ఉంది. కేసును వాపసు తీసుకోవాలని నిందితుడు మరియు అతని కుటుంబం బాధితురాలి కుటుంబాన్ని బెదిరిస్తున్నారు.
ఇప్పటికే వహాబ్కు వివాహం జరిగిందని.. 5 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలు ఉన్నారని హిందూ సంఘాలు ఆరోపిస్తూ ఉన్నాయి. వహాబ్ మరో ముగ్గురు బాలికలను ఇలాగే వలలో వేసుకున్నట్లు తెలిసింది. కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు తెలిపారు.