More

    రష్యా అధ్యక్షుడి బాడీగార్డ్స్‎లో ఆయన పాత్రే కీలకం..!

    ఉక్రెయిన్ పై రష్యా దాడికి దిగినప్పటి నుంచి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఓ హాట్ టాపిక్ గా మారారు. అయితే వ్లాదిమిర్ పుతిన్ ఓ ప్ర‌త్యేక‌మైన వ్య‌క్తి. ర‌ష్యా అధ్య‌క్షుడి కోసం ఓ ప్ర‌త్యేక‌మైన బాడీగార్డ్ కూడా ఉన్నాడు. పుతిన్ ఎక్క‌డికి వెళ్లినా ఆ బాడీగార్డ్ ఆయ‌నేతోనే ఉంటారు. కానీ ఆ బాడీగార్డ్ చేసే ప‌ని తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.

    పుతిన్ మ‌ల‌మూత్రాల‌ను ఆ బాడీగార్డ్ సేక‌రిస్తుంటాడ‌ని తాజాగా ఓ రిపోర్ట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఫాక్స్ న్యూస్ దీనిపై ఓ క‌థ‌నాన్ని రాసింది. అయితే పుతిన్ ఆరోగ్య ర‌హ‌స్యాలు తెలియ‌కుండా ఉండేందుకు.. ఆయ‌న ఎక్క‌డికి వెళ్లినా ఓ బాడీగార్డ్ పుతిన్ మ‌ల‌మూత్రాల‌ను సేక‌రిస్తున్న‌ట్లు ఆ క‌థ‌నంలో చెప్పారు. ఉక్రెయిన్‌పై దాడికి వెళ్లిన ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ ఆరోగ్యం బాగా క్షీణించిన‌ట్లు ఇటీవ‌ల పుకార్ల వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఆరోగ్య బ‌ల‌హీన‌త‌లు బ‌య‌ట‌ప‌డ‌కుండా ఉండేందుకు పుతిన్ మ‌ల‌మూత్రాల‌ను బాడీగార్డ్ సేక‌రిస్తుంటాడ‌ని ఫ్రెంచ్ మ్యాగ్జిన్ పారిస్ మాక్ తెలిపింది.

    విదేశీ ఇంటెలిజెన్స్‌కు ఆరోగ్య ర‌హ‌స్యాలు చిక్క‌వ‌ద్దు అని పుతిన్ ఆ జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న‌ట్లు డీఐఏ ఇంటెలిజెన్స్ ఆఫీస‌ర్ రెబెకా కోఫ్ల‌ర్ తెలిపారు. ర‌ష్యాకు చెందిన ఫెడ‌ర‌ల్ గార్డ్ స‌ర్వీస్ ప్ర‌త్యేక సూట్‌కేసును తీసుకువెళ్తుంద‌ని, ఆ సూట్‌కేస్‌లో పుతిన్ మ‌ల‌మూత్రాల‌ను తిరిగి మాస్కోకు పంపిస్తార‌ని ఫ్రెంచ్ ప‌త్రిక తెలిపింది. ప్ర‌త్యేక ప్యాకెట్ల‌లో వ్య‌ర్ధాల‌ను ప్యాక్ చేసి, ఆ ప్యాకెట్ల‌ను బ్రీఫ్‌కేస్‌లో పెడుతార‌ని మ‌రో ప‌త్రిక రాసింది. దేశాధ్య‌క్ష బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటి నుంచి పుతిన్ ఇలాంటి ప‌నిచేస్తున్న‌ట్లు తెలుస్తోంది. పుతిన్‌కు బ్ల‌డ్ క్యాన్స‌ర్ ఉన్న‌ట్లు ఇటీవ‌ల‌ వార్త‌లు వ‌చ్చాయి. కానీ ఆ రూమ‌ర్ల‌ను ర‌ష్యా అధికారులు కొట్టిపారేస్తున్నారు.

    spot_img

    Trending Stories

    Related Stories