విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మికులు, ఉద్యోగులు, కార్మిక సంఘ నేతలు కొనసాగిస్తున్న దీక్ష శిబిరాన్ని పోలీసులు భగ్నం చేశారు. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ముందస్తుగా ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రధాన కార్మిక సంఘాల నేతలతో పాటు ఉద్యోగులు, కార్మికులను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఐతే కార్మికులు, ఉద్యోగులను అరెస్ట్ చేయడం వల్ల పోరాటం ఆగదని కార్మిక సంఘ నేతలు హెచ్చరించారు. ఉక్కు పరిరక్షణ దీక్ష చేపట్టి నేటికి 638వ రోజు.