కేఏ పాల్ పార్టీకి, కేసీఆర్ పార్టీకి తేడా లేదు: విష్ణువ‌ర్ధ‌న్‎రెడ్డి

0
787

టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మారుస్తూ జాతీయ రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించిన కేసీఆర్ తీరుపై బీజేపీ ఏపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విష్ణువ‌ర్థ‌న్‎రెడ్డి విమ‌ర్శలు గుప్పించారు.
ఆంధ్రప్రదేశ్ కు తీరని ద్రోహం చేసిన కేసీఆర్ ఏ మొహం పెట్టుకుని రాష్ట్రంలో అడుగుపెడతారని ప్రశ్నించారు. అనంతపురంలోని ఆర్.అండ్.బి గెస్ట్‎హౌస్‎లో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో కేఏ పాల్ పార్టీకి కేసీఆర్ పార్టీకి ఏమాత్రం తేడా లేదన్నారు. స్పష్టమ్తెన జాతీయ విధానం ప్రకటించకుండా జాతీయ పార్టీ పెట్టాడన్నారు. గతంలో తెలుగుతల్లి విగ్రహానికి చెప్పులు దండ వేసి చేతులు, కాళ్లు తొలగించిన కేసీఆర్ ఇప్పుడు ఏపీలో వస్తానంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి చెందిన ఎందరో మహనీయుల విగ్రహాలను తొలగించిన కేసీఆర్ ముందు వారి కుటుంబాలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దేశాన్ని ఏకం చేస్తాననే కేసీఆర్ ముందు ఏపీలో సాగునీటి ప్రాజెక్టుల విషయంలో పెట్టిన కేసులను వెనక్కు తీసుకోవాలన్నారు. మరోవైపు వైఎస్‎ఆర్‎సీపీ ప్రభుత్వ తీరుపై కూడా ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

3 × one =