More

    వాయు’గండం’

    నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం డైరెక్షర్ సునంద తెలిపారు. వాయుగుండం వాయువ్య దిశగా దక్షిణ కోస్తా, తమిళనాడు పుదుచ్చేరి వైపు ప్రయాణిస్తూ బలహీన పడుతుందన్నారు. ఉత్తర కోస్తాపై ఈ ప్రభావం తక్కువగా ఉంటుందని తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.

    Trending Stories

    Related Stories