More

    జీవీఎంసీ సిబ్బంది అత్యుత్సాహం.. బీజేపీ జెండాలు తొలగింపు

    విశాఖపట్నం సిరిపురం జంక్షన్‎లోని ద్రోణంరాజు సర్కిల్‎లో బీజేపీ జెండాలను అధికారులు తొలగించారు. అయితే అదే సమయంలో అటుగా వెళుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు గమనించి అధికారులను నిలదీశారు. ఇదేమిటని ప్రశ్నిస్తే అధికారులు నీళ్ళు నమిలారు. బీజేపీ జెండాల తొలగింపుతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. సంఘటనా స్థలానికి బీజేపీ శ్రేణులు భారీగా చేరుకున్నారు. తాము రెండు రోజుల నుంచి జెండాలు, ఫ్లెక్సీ లను ఏర్పాటు చేస్తున్నామని, జెండాల ఏర్పాటు విషయమై జీవీఎంసీ కమిషనర్‎కు ఎంపీ జీవీఎల్ తెలియజేశారని సోము వీర్రాజు చెప్పారు. అయితే కొంతమంది జీవీఎంసీ సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించి, జెండాలను వాహనంలో తరలించే యత్నం చేస్తున్నారని సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.

    Trending Stories

    Related Stories