విశాఖలో ప్రధాని మోదీ బహిరంగ సభ వేదిక ప్రాంగణం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. స్వాగత ద్వారాలు కాషాయ జెండాలతో పాటు సభ విజయవంతం కావడానికి సహకారమందిస్తున్న అధికార పార్టీ వైఎస్సార్సిపి జెండాలు రెపరెపలు లాడుతున్నాయి. ప్రధాని, ముఖ్యమంత్రి, గవర్నర్లు పర్యటించే మార్గాల్లో పోలీసులు కాన్వాయ్ ట్రయల్ రన్‌ను నిర్వహించారు.