SportsUncategorized

దీపావళికేమో టపాసుల బ్యాన్.. భారత్ ఓడిపోతే మాత్రం టపాసులు కాల్చుకోవచ్చు

దీపావళి పండుగ వచ్చిందంటే చాలు.. ఎక్కడ లేని నియమాలను కొన్ని రాష్ట్రాలలో తీసుకుని వస్తారు. ముఖ్యంగా ఢిల్లీలో దీపావళి సమయంలో టపాసుల బ్యాన్ చేస్తూ ఉంటారు. ఎవరూ నిల్వ చేయడానికి వీలులేదని అక్కడి ప్రభుత్వం ఆంక్షలు విధిస్తూ ఉంటుంది. ఇటీవల భారత్ పాకిస్తాన్ చేతిలో మ్యాచ్ ఓడిపోగానే.. ఢిల్లీ లోని కొన్ని ప్రాంతాల్లో టపాసులు పేల్చారు. దీనిపై భారత మాజీ క్రికెటర్లు వీరేందర్ సెహ్వాగ్, గౌతమ్ గంభీర్ తీవ్రంగా స్పందించారు.

టపాసుల బ్యాన్ అంశంపై తన వాయిస్ ను రైజ్ చేసాడు సెహ్వాగ్. “Firecrackers are banned during Diwali but yesterday in parts of India there were firecrackers to celebrate Pakistan ‘s victory. Achha they must have been celebrating victory of cricket. Toh , what’s the harm in fireworks on Diwali. Hypocrisy kyun ,Saara gyaan tab hi yaad aata hai” అంటూ ట్వీట్ చేశాడు. ‘టపాసులు చాలా ప్రాంతాల్లో బ్యాన్ అని చెబుతూ ఉంటారు. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం పాకిస్తాన్ గెలవగానే టపాసులు పేల్చారు. క్రికెట్ గెలిచిందని సంబరాలు జరుపుకున్నారని అనుకున్నాం. అయితే దీపావళి రోజు మాత్రమే టపాసులు కాలిస్తే పర్యావరణానికి బాగుండదా.. ఆ సమయంలో మాత్రమే జ్ఞానాన్ని బోధించడానికి ఎంతో మంది ముందుకు వస్తారు’ అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.

‘భారత్ ఓడిపోయిందని టపాసులు పేల్చిన వాళ్లు భారతీయులే కాదని’ గౌతమ్ గంభీర్ తెలిపారు. ‘Those bursting crackers on Pak winning can’t be Indian! We stand by our boys! #Shameful’ అంటూ గంభీర్ ట్వీట్ చేశారు.

భారత్ ఓటమికి మొహమ్మద్ షమీని బాధ్యుడిని చేస్తూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. సోషల్ మీడియాలో అతడికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. అయితే షమీకి మద్దతుగా పలువురు క్రికెటర్లు ట్వీట్లు చేస్తున్నారు. జట్టు ఓటమికి షమీని ఒక్కడినే బాధ్యుడిని చేయడం… వ్యక్తిగతంగా, మతంపరంగా అతడిని దూషించడం తగదని హితవు పలికారు. షమీకి నైతికంగా అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. మ్యాచ్‌లో గెలుపోటములు సహజమేనని, దానికి ఒక కులానికో లేదా మతానికో.. పూయాలనుకోవడం సరికాదని చెప్పారు. వీరేందర్ సెహ్వాగ్ ఈ ట్రోల్స్ పై స్పందించారు. ‘‘భారత జెర్సీ వేసుకుని ఆడే ప్రతి ఆటగాడి మనసులో ఇలాంటి ట్రోలర్ల కన్నా ఎక్కువగా దేశభక్తి ఉంటుంది. షమీపై కామెంట్స్ చూసి షాకయ్యా. ఈ విషయంలో క్రికెట్ ప్రపంచం అతని వెంట ఉంటుంది’ అని సెహ్వాగ్ అన్నాడు. ‘షమీ నీతోనే ఉన్నా. వచ్చే మ్యాచ్‌లో సత్తా చూపించు” అంటూ ట్వీట్ చేశాడు.

Related Articles

Back to top button