More

    విరాట్ చెప్పిన ఆ మాటే.. ఇషాన్ కిషన్ రెచ్చిపోయేలా చేసింది

    ఐపీఎల్ తుది అంకానికి చేరుకుంది. అయితే భారత క్రికెట్ జట్టు అభిమానుల ముఖ్య ఆలోచన మొత్తం.. టీ20 ప్రపంచ కప్ కు ఎంపిక చేసిన ఆటగాళ్ల ఫామ్ గురించే ఉంది. ముఖ్యంగా ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్ లను ఎందుకు సెలెక్ట్ చేశారా..? అనే ప్రశ్న అభిమానులను వెంటాడింది. అయితే ముంబై ఇండియన్స్ లాస్ట్ లీగ్ మ్యాచ్ లో ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్ లు అద్భుతంగా ఆడి తమ సత్తాను చూపించారు.

    ముఖ్యంగా ఇషాన్ కిషన్ వరుసగా ఫెయిల్ అవుతూ రావడంతో ఒకానొక దశలో అతడిని ముంబై ఇండియన్స్ యాజమాన్యం తప్పించింది. ఆ సమయంలో ఇషాన్ కిషన్ తో భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడాడు. సన్ రైజర్స్ తో మ్యాచ్ అనంతరం మాట్లాడిన ఇషాన్ కిషన్.. తాను వరల్డ్ కప్ కోసం సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. ఓపెనర్ గానూ బరిలోకి దిగే అవకాశం ఉందని అతడు చెప్పుకొచ్చాడు. విరాట్ కోహ్లీనే స్వయంగా ఈ విషయం చెప్పాడని తనతో ఏమేమి చెప్పాడో ఇషాన్ బయట పెట్టాడు. ‘‘విరాట్ భాయ్ తో చాట్ చేశాను. నువ్వు టీ20 వరల్డ్ కప్ కు ఓపెనర్ గా ఎంపికయ్యావ్.. రెడీగా ఉండమని విరాట్ భాయ్ చెప్పాడు. ఎలాంటి సవాల్ నైనా ఎదుర్కోవాలని సూచించాడు’’ అని తెలిపాడు. హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో ఇషాన్ కిషన్ 32 బంతుల్లోనే 84 పరుగులు చేశాడు. రాజస్థాన్ తో మ్యాచ్ లోనూ 25 బంతుల్లోనే అర్ధ శతకం కొట్టాడు.

    Trending Stories

    Related Stories