More

    విరాట్ కోహ్లీ.. సంచలన ప్రకటన..!

    భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. భారత టీ20 జట్టు కెప్టెన్ గా తాను వైదొలుగుతున్నట్లు తెలిపాడు. టీ20 ప్రపంచ కప్ తర్వాత తాను టీ20 కెప్టెన్ గా కొనసాగబోనని విరాట్ కోహ్లీ కీలక ప్రకటన చేశాడు. తన ట్విట్టర్ ఖాతాలో విరాట్ కోహ్లీ ఈ విషయాన్ని తెలియజేస్తూ ఒక లెటర్ ను ఉంచాడు. తాను ఎంతో ఒత్తిడిని ఎదుర్కొన్నానని ఇకపై కాస్త తగ్గించడానికి టీ20 కెప్టెన్ గా తప్పుకున్నానని తెలిపాడు. ఈ విషయం గురించి కోచ్ రవి శాస్త్రితోనూ, రోహిత్ శర్మతోనూ చర్చించానని కూడా కోహ్లీ తెలిపాడు. బీసీసీఐ పెద్దలకు కూడా తన నిర్ణయాన్ని తెలిపానని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

    టీ20 వరల్డ్‌కప్ 2021 తర్వాత వన్డే, టీ20 ఫార్మాట్లలో కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోబోతున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే కేవలం టీ20 కెప్టెన్ గా మాత్రమే తాను తప్పుకుంటూ ఉన్నానని విరాట్ స్పష్టం చేశాడు. అక్టోబర్‌లో యూఏఈ, ఒమన్‌ వేదికగా జరిగే టీ20 వరల్డ్‌కప్‌ విరాట్ కోహ్లీకి టీ20 కెప్టెన్‌గా ఆఖరి టోర్నమెంట్ అని తెలుస్తోంది. ఐపీఎల్‌లో విజయవంతమైన కెప్టెన్‌గా కొనసాగుతున్న టీమిండియా వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు టీ20ల్లో సారథ్య బాధ్యతలు అప్పగించనున్నారు.

    Image

    Trending Stories

    Related Stories