వైరల్ అవుతున్న విరాట్ కోహ్లీ హోటల్ రూమ్ వీడియో.. ఇంకెక్కడి ప్రైవసీ..!

0
1058

టీ20 ప్రపంచ కప్‌ కోసం భారత జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉంది. అక్కడ భారత ఆటగాళ్లు ఓ హోటల్‌లో బస చేస్తున్నారు. విరాట్‌ కోహ్లీ ఉంటున్న రూమ్‌కు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. విరాట్‌ తన వస్తువులను ఎలా జాగ్రత్తగా పెట్టుకున్నాడో, షూ కలెక్షన్స్‌, అతను వాడే వస్తువులు ఇలా ప్రతీది వీడియోలో చూపించారు. చివరకు బాత్ రూమ్‌ను కూడా వదలలేదు.

ఎలాగూ వైరల్ అయిన ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా విరాట్ షేర్‌ చేస్తూ ఈ వీడియో తన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించేదిలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘అభిమానులు తమ ఫేవరెట్‌ ఆటగాళ్లను చూసేందుకు, కలిసేందుకు ఉత్సాహం చూపుతారనే విషయం నాకు తెలుసు. వారి ఆసక్తి, ఉత్సాహాన్ని నేను అర్థం చేసుకోగలను. అలాంటి అభిమానులను ఎప్పుడూ నేను అభినందిస్తాను.” అని చెప్పుకొచ్చారు. కానీ నా గదికి సంబంధించిన వీడియోను చూసి నేను షాకయ్యాను. ఇది నా వ్యక్తిగత స్వేచ్ఛను హరించేలా ఉంది. నా హోటల్ రూమ్‌లో కూడా నాకు ప్రైవసీ లేకుంటే ఎలా..? ఇలాంటి అభిమానాన్ని నేను ప్రోత్సహించనని చెప్పేశారు. ఆటగాళ్ల వ్యక్తిగత స్వేచ్ఛను హరించడం ఏ మాత్రం భావ్యం కాదని.. దయచేసి ఆటగాళ్ల ప్రైవసీని గౌరవించండని కోహ్లీ అభిమానులను కోరాడు.

కింగ్ కోహ్లీస్ హోటల్ రూమ్’ అని క్యాప్షన్ పెట్టిన ఆ అభిమాని కోహ్లీకి సంబంధించిన కిట్ బ్యాగ్, షూస్ వంటి వస్తువులన్నీ వీడియో తీశాడు. బాత్ రూమ్ వరకు వెళ్ళాడు.. అల్మారా కూడా తెరిచి వీడియో పోస్ట్ చేశాడు.