More

    మైనర్లే జీహాద్ ఆయుధం..!

    చరిత్రలో జరిగిన హింసాత్మక ఘటనలను.. తేదీలు, నగరాల పేరుతో గుర్తుచేసుకుంటాం. కానీ ఈ మధ్య మన దేశంలో జరుగుతున్న హింసను అలా గుర్తుచేసుకునేందుకు వీలులేదు. ఎందుకంటే.. ఇస్లాం ఛాందసవాదులు.. అభం శుభం తెలియని చిన్నారులను ఆయుధంగా చేసుకుని ఎలా హింసకు ప్రేరేపించారనే విషయాన్ని భవిష్యత్తులో చెప్పుకోవాల్సి వస్తుంది.

    మతోన్మాదులు పిల్లలను కవచాలుగా ఎలా ఉపయోగించుకున్నారో గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. కనిపెంచిన పిల్లల్ని హింసాకాండకు ఎలా ప్రోత్సహించారో చరిత్ర పాఠాల్లో చదువుకోవాల్సి వస్తుంది. అందుకు ఉదాహణే ఈ ఘటన. బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ ప్రకటనపై మతోన్మాదులు దేశం మొత్తం అగ్గిరాజేసేస్తున్నారు. శుక్రవారం ప్రార్థనల తర్వాత.. దేశంలోని పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ సహా ఇతర రాష్ట్రాల్లో కూడా హింసాకాండకు పాల్పడ్డారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఇందులో ముఖ్యంగా మైనర్లు, పిల్లలను ఆయుధంగా ఉపయోగించారు. హింసాత్మక నిరసనల్లో మైనర్లను ముందుపెడుతున్నారు. వారితో వ్యతిరేక నినాదాలుచేయిస్తున్నారు. పలకా బలపం పట్టాల్సిన చిన్నారులు.. జెండాలు, బ్యానర్లు పట్టి రోడ్లపై దేశ వ్యతిరేక నినాదాలు చేస్తున్నారు. ఈ నిరసనలు, విధ్వంస కాండపై పోలీసులు విచారణ చేపట్టిన సమయంలో మైనర్లను ముందు పెడుతున్నారు. తెలివిగా తప్పించుకుంటున్నారు.

    ఇదే ఇస్లామిస్టులు నుపుర్ శర్మ పోస్టర్‌పై మూత్ర విసర్జన చేయించి.. హేయమైన చర్యకు పాల్పడ్డారు. అంతేకాదు.. పోలీసులపై రాళ్లదాడులు చేయించారు. జార్ఖండ్‌లోని రాంచీలో ఈ ఘటన జరిగింది. నుపుర్ శర్మకు వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రదర్శనలో ముక్కుపచ్చలారని పిల్లలు, మైనర్లే కీలక పాత్ర పోషించారు. వీళ్లను ముందుపెట్టి కొందరు రాళ్ల దాడికి దిగారు. ఈ ఘటనలో ఇద్దరు యువకులు మరణించారు. ఈ మరణాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలని.. చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు పరిహారం చెల్లించాలని, ఉద్యోగం కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

    ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్రంగా చర్చ జరుగుతోంది. ప్రదర్శన హింసాత్మకంగా మారుతుందని, పిల్లలను అక్కడికి పంపకూడదని ఆ చనిపోయిన తల్లిదండ్రులకు తెలియదా..? పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్లది కాదా.? ఇలాంటి ప్రదర్శనలకు వెళ్లవద్దని తమ బిడ్డలకు వాళ్లు చెప్పలేదా..? నిరసన ప్రదర్శనలకు వెళ్లడం సినిమాకు వెళ్లడంవంటిది కాదు కదా..? తెలిసి కూడా ఎందుకు వెళ్లనిచ్చారు..? అది తప్పు కాదా? అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు.

    మైనర్లను ఆయుధంగా మార్చుకుని విధ్వంసానికి పాల్పడడం ఇది మొదటిసారి కాదు.. షాహీన్ బాగ్ లో కూడా మైనర్లు, మహిళలే ముందుండి ప్రభుత్వానికి, దేశానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని నడిపారు. నెలల తరబడి సాధారణ పౌరుల జీవితాన్ని నరకంగా మార్చేశారు. షాహీన్‌బాగ్‌ ఒక్కటే కాదు.. CAAకి వ్యతిరేకంగా జరిగిన ప్రదర్శనల్లో ఇలాంటి అనేక సంఘటనలు చాలా మీడియాలో, సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కొద్ది రోజుల క్రితం కర్ణాటకలో PFIనిర్వహించన ఒక ర్యాలీలో ఒక మైనర్ బాలుడు హిందువులకు, దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాడు. వీటన్నింటినీ చూస్తుంటే.. మతోన్మాదులు రూటు మార్చినట్లే కనిపిస్తోందంటున్నారు సోషల్ మీడియాలో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. నిరసనలు, విధ్వంస కాండకు మైనర్లనే అస్త్రం మార్చుకుని కొత్త పంథాను అవలంబిస్తున్నారని స్పష్టంగా తెలుస్తోందంటున్నారు.

    Trending Stories

    Related Stories