More

    ఆ స్కూల్లో ప్రతినిత్యం హనుమాన్ చాలీసా..! వైరల్ అవుతున్న వీడియో..!!

    సాధారణంగా హనుమాన్ చాలీసా దేవాలయాల్లోనూ, ఇళ్ళల్లోనూ ప్రతినిత్యం వినిపిస్తుంటుంది. కానీ, ఓ పాఠశాలలో కూడా ప్రతి రోజూ హనుమాన్ చాలీసా చదువుతారని మీకు తెలుసా..? ఓ పాఠశాలలో ఉదయం ప్రార్థనా సమయంలో విద్యార్థులు హనుమాన్ చాలీసా ఆలపిస్తారు.

    ప్రభాత సమయంలో, సుమధుర సంగీతంతో.. స్కూల్ పిల్లలు, ఉపాధ్యాయులు ఏక కంఠంతో హనుమాన్ చాలిసా పారాయణ చేస్తున్న వీడియో.. ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో ఎన్నో పాఠశాలలకు, కళాశాలలకు, ఇంకా ఎన్నో సంస్థలకు, వ్యవస్థలకు ఆదర్శనీయంగా నిలుస్తోంది. విద్యార్థులు, గురువులు సాగిస్తున్న హనుమాన్ చాలిసా అద్భుత గానం నెట్టింట్లో వైరల్ గా మారింది.

    పాఠశాల ఉపాధ్యాయుడు ఈ వీడియోను చిత్రీకరించి నెట్లో వైరల్ చేసినట్టు తెలుస్తోంది. ఇందులో స్కూల్ పిల్లలు ఎంతో శ్రద్ధగా, భక్తితో హనుమాన్ చాలిసా పఠిస్తున్నట్టు వీడియోలో కనిపిస్తోంది. అయితే, ఆ ఉపాధ్యాయుని పేరు కాని, ఆ విద్యార్థులు ఎవరో కాని, ఆ పాఠశాల ఎక్కడిదో కాని ఎవరికీ తెలియడం లేదు. ఎందుకంటే ఆ వీడియోలో ఈ వివరాలేవీ లేవు. ఈ వీడియోపై ఎన్నో ప్రశంసలు వస్తుండగా, కొన్ని విమర్శలు సైతం వస్తున్నాయి.

    హిందూ దేవతలపై, లేదా హిందూ సంస్కృతిపై ప్రశంసలు కురుస్తున్నాయంటే.. కొందరు అసూయాపరులకు, అసురగణాలకు కడుపు మండిపోవడం సహజమే కదా..! ఉట్టిపుణ్యాన విమర్శలకు దిగుతారు. తమ అసూయను వెళ్లగక్కుతారు. తానెప్పుడూ ఇలాంటివి చూడలేదని, ఈ తరహా ప్రార్థనలు సరికాదని ఓ వ్యక్తి కామెంట్ పెట్టాడు. అంతటితో ఆగకుండా.. ఇందులోకి ప్రధాన మంత్రి మోదీ ప్రస్థావన తెచ్చేశాడు. మోదీజీ.. అన్ని పాఠశాలల్లో ఈ ప్రార్థనలు పెట్టేస్తారేమో.. అని వ్యాఖ్యానించాడు.

    మెజార్టీ హిందూ బంధువులు ఏనాడు తమ ఆధిక్యత ప్రదర్శించలేదు. మతసామరస్యానికి పెద్దపీట వేస్తూ అందరినీ తమ సొంత బంధువుల్లా చూసుకుంటున్నారు. పవిత్రమైన హిందు దేవతలకు, హిందూ దేవాలయాలకు అపచారాలు చేసి.. రాక్షస చేష్టలకు పాల్పడుతున్నా.. భూదేవి అంత ఓర్పుతో క్షమాగుణాన్ని ప్రదర్శిస్తోంది. ఒక్కసారి.. హైందవ జాతి పిడికిలి బిగిస్తే.. ఏమవుతుందో అందరికీ తెలుసు. ఇప్పటికైనా.. దైవ దూషణలకు, హిందూ మత ద్వేషానికి పాల్పడే వారు తమ వైఖరి మార్చుకుంటే మంచిది. హనుమాన్ చాలిసా వంటి గొప్ప పారాయణలో భాగస్వాములై.. తమ పాప ఫలాలు దూరం చేసుకోవాలని హిందూ బంధువులు కోరుతున్నారు.

    ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, లైక్ చేయండి, పది మందికీ షేర్ చేయండి. నేషనలిస్ట్ హబ్ గ్రూపాఫ్ ఛానెల్స్ ను సబ్ స్క్రయిబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజానికి మద్దతు తెలపండి.

    Trending Stories

    Related Stories