ఉత్తరప్రదేశ్ రాష్ట్రం శహరాన్‌పూర్‌లోని కుర్ది గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. శనివారం ఆ గ్రామస్థులంతా ఓ చోటుకి వచ్చారు. పూజారులు మంత్రాలు చదువుతూ ఉండగా చెమర్చిన కళ్లతో బాబూజీకి అంత్యక్రియలు నిర్వహించారు. ఏకంగా 3వేల మంది ఈ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. బాబూజీ ఓ ఎద్దు. 20 సంవత్సరాల ఆ ఎద్దు… అదే ఊళ్లో ఉంటూ చనిపోయింది. ఊరు ఊరంతా విషాదంలో మనిగిపోయారు. మనుషులకు చేసినట్లే అంత్యక్రియలు చెయ్యాలని నిర్ణయించుకొని… అన్నీ శాస్త్రోక్తంగా నిర్వహించారు.

పూజారులు ప్రార్థనల మధ్య కుర్ది గ్రామంలోని దాదాపు 3,000 మంది బాబూజీ తెరహ్వీకి హాజరయ్యారు. ఎద్దు కోసం దహన సంస్కారాలు, తెరహ్వీ (దినం) సహా మతపరమైన వేడుకలు నిర్వహించబడ్డాయి. ఎద్దుకు అంత్యక్రియల కోసం ఊరంతా డబ్బులు వేసుకుంది. ఘనంగా అంత్యక్రియలు జరిపించింది. ఆచారాలు, పద్ధతులు, సంప్రదాయాలు అన్నీ పాటించి కర్మకాండలు జరిపించారు. అంత్యక్రియల తర్వాత 3000 మంది కలిసి భోజనాలు చేశారు. ఎద్దు ఫోటో ఉండడంతో చుట్టూ పువ్వులు, కరెన్సీ నోట్లతో డెకరేట్ చేశారు. ఆ ఎద్దు సాధారణమైన మామూలు ఎద్దు కాదని.. అది ఎప్పుడూ ఊళ్లో ఎవర్నీ ఏమీ అనలేదని గ్రామస్తులు తెలిపారు. పిల్లలైతే దానితో ఆడుకుంటారని కూడా చెప్పారు. ‘ఊళ్లో ఉన్న పవిత్రమైన ప్రాంతంలో ఈ ఎద్దు ఓ రోజు కనిపించింది.. ఎక్కడి నుంచి వచ్చిందో మాకు తెలియదు. కానీ దాన్ని శివుడి నందీశ్వరుడిగా మేం భావిస్తామని’ మరో గ్రామస్తుడు చెప్పుకొచ్చాడు. బాబూజీ అంటే మాకు భక్తి, ప్రేమ అని గ్రామస్తులు తెలిపారు. బాబూజీ సాధారణ మరణం పొందాడని.. ఎవరికీ ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా వెళ్లిపోయాడని పలువురు చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా ఓ గ్రామం మొత్తం బాబూజీ అంత్యక్రియలకు హాజరు అయ్యిందంటే ఎంతగా ఆ గ్రామస్తులతో ఎద్దు కలిసిపోయిందోనని అందరికీ అర్థమవుతుంది. బాబూజీ అంత్యక్రియలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి.





Great 🙏🙏