More

  విక్రమ్ సంపత్ లాంటివారిని కాపాడుకోవడం మనందరి బాధ్యత

  సత్యమేవ జయతే…! ఇది ముండకోపనిషత్తు మాట..! ఒక జాతి…,జాతిగా మనగలుగుతుందా…, బ్రతికి బట్టకట్టగలుగుతుందా…, అభివృద్ధి చెందగలుగుతుందా.., అన్నది ఆ జాతి నడవడిపై ఆధారపడి ఉంటుంది. జాతి నడవడిని విశ్వాసాలు నిర్ణయిస్తాయి.! తన అస్థిత్వం గురించి కానీ, తన గత వైభవ చరిత్రను గురించిన పూర్తి వాస్తవాలను తెలుసుకోలేని జాతికి మనుగడ ఉండదు. తన జాతీయ స్వాభిమానాన్ని మర్చిపోయి, పూర్తిగా ఆత్మనూన్యతభావనలో జీవిస్తున్నంత కాలం.., ఆ జాతి నిర్ణయాత్మక శక్తిగా మారే అవకాశం ఉండదు.
  అందుకే చరిత్రను అధ్యయనం చేయటం., ఏ జాతి ప్రగతికైనా చాలా అవసరం..! ఆ చరిత్రాధ్యయనంతో, మన పాలకులు చేసిన తప్పిదాల నుంచి మనం గుణపాఠాలు నేర్చుకోవాలి.
  దేశ చరిత్రను కేవలం గతాన్ని తెలిపే కట్టుకథలుగా చూడరాదు. చరిత్ర ఆధారంగానే మన దేశ అభ్యున్నతి…దాని వికాసయాత్ర.. జీవన క్రమం, ప్రజల ఆచార వ్యవహారాలు తెలుస్తాయి. అంతేకాదు చరిత్ర అంటే ఆ దేశ ప్రజల గుర్తింపు అని మనం గుర్తు పెట్టుకోవాలి.! అయితే ఆ చరిత్ర నుంచి.., మన దేశ ప్రజలను విముఖల్ని చేయడం అంటే…, మనల్ని మన గతాన్నుండి తప్పించడమే అవుతుందని మనం మర్చిపోరాదు.
  అయితే మన దేశంపై వరుసగా, వెయ్యి ఏళ్ళకు పైగా సాగిన, నిరంతర విదేశీ దండయాత్రలు, వారు జరిపిన ఊచకోతలు , ఆలయాల ధ్వంసం , మతం ఆధారంగా మన పుణ్యభూమి భారత్ ను , ముక్కలు చేయడం వంటి కఠోర వాస్తవాలను.., మన భవిష్యత్ తరాలకు చరిత్ర ద్వారా బోధిస్తే.., తద్వారా కొంతమంది సెంటిమెంట్లు హర్ట్ అవుతాయని…, మొత్తం చరిత్రను చెరపవేసే ప్రయత్నాలు జరిగాయా? ఆధారాలే లేని కట్టుకథల తప్పుడు సిద్ధాంతాలను చరిత్రలో చొప్పించారా? విదేశీ దురాక్రమణదారులే విజేతలు, భారతీయ రాజులు అందరూ పరాజితులు. అసలు భారత దేశ చరిత్ర అంటేనే.., పరాజితుల చరిత్ర అని మన విద్యార్థులకు మనమే ఆత్మనూన్యతను నూరిపోస్తున్నామా?
  అవును… నేను చెబుతున్నది నిజం.! అబద్దం కాసేపు ఆనందాన్ని ఇస్తూ.., అందంగా అనిపించిన అది ఏనాటికైనా నశించేదే.! శాశ్వతంగా నిలిచేది సత్యమే.!
  గత వారం ఇండియా టుడే న్యూస్ చానల్.. ఇండియా టుడే కాంక్లేవ్ 2021 ను నిర్వహించింది. దేశంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖలతో చర్చ కార్యక్రమాలను నిర్వహించింది. ఇందులో వీరసావర్కర్ పై అసత్యాలతోపాటు, భారతీయ చరిత్రలో కొంతమంది చరిత్రకారుల ద్వారా చొప్పించబడిన వికృతులపై, ప్రముఖ చరిత్రకారుడు విక్రమ్ సంపత్ తోపాటు, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ చర్చలో పాల్గొన్నారు. ఈ చర్చకు సీనియర్ జర్నలిస్టు రాజ్ దీప్ సర్దేశాయ్ యాంకర్ గా వ్యవహారించారు.
  జాతి నిర్మాణమనే సాకుతో..నెహ్రూవియన్ సెక్యులలరిజం ఆదర్శాలను దేశంలో నిలబెట్టడానికి కాంగ్రెస్ పాలకులు, ఉద్దేశపూర్వకంగానే విదేశీ ఇస్లామిక్ దురాక్రమణలను, ముస్లిం పాలకులు… హిందువులపై మతపరంగా జరిపిన చారిత్రక దౌర్జన్యాలను తక్కువ చేసి చూపించారని…విక్రమ్ సంపత్ తో జరిగిన సంవాదంలో, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తప్పనిసరి పరిస్థితుల్లో అంగీకరించడం జరిగింది.
  అలాగే కాంగ్రెస్ పార్టీ తనకు తెలియకుండానే మార్క్సిస్టు చరిత్రకారులకు ఎలా ఇనిస్టిట్యూషన్ బేస్ ను ఏర్పాటు చేసిందో కూడా విక్రమ్ సంపత్ ఇండియా టుడే కాంక్లేవ్ సాక్షిగా బహిర్గతం చేశాడు. అసలైన దేశ చరిత్రకు ప్రాధాన్యం ఇవ్వకుండా, మార్క్సిస్టు చరిత్రకారులు మన విద్యార్థుల కోసం రూపొందించిన చరిత్ర పాఠ్యపుస్తకాల్లో సైతం వక్రీకరణలకు పాల్పడిన వైనాన్ని ఆయన బైట పెట్టారు. భారత దేశ చరిత్రకు ఢిల్లీని సెంటర్ పాయింట్ గా తీసుకున్నారని… అదే సమయంలో దేశంలోని మిగిలిన ప్రాంతాల్లోని రాష్ట్రకూటులకు, చాళుక్యులకు, శాతవాహనులకు, అహోమ్ రాజులకు, నాగాలకు తగినంత ప్రాధాన్యం ఇవ్వలేదని సంపత్ గుర్తు చేశారు.
  మొత్తంగా ఇండియా టుడే కాంక్లేవ్ లో అంత్యంత ప్రభావవంతంగా…హిస్టారికల్ ఫ్యాక్ట్స్ తో విక్రమ్ సంపత్… మార్క్సిస్టు చరిత్రకారులు కట్టుకథలతో నిర్మించిన అబద్దాల చరిత్రపుటల పేకమేడలను ఒక్కసారిగా కూల్చివేశాడు. కాంగ్రెస్ ప్రోద్బలంతో.. వామపక్ష చరిత్రకారులు., భారత జాతికి చేసిన ద్రోహాన్ని ఆయన వివరించిన తీరు వీక్షకులను మంత్రముగ్ధులను చేసింది. విక్రం సంపత్ తమ కళ్లు తెరిపించాడని ఎంతోమంది నెటిజన్లు కామెంట్లు చేశారు.
  అయితే… అబద్దాల పునాదులపై తాము రచించిన చరిత్ర పాఠ్యపుస్తకాలన్ని కల్పితమని నిరూపితం కావడంతో, మార్క్సిస్టు చరిత్రకారులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. వెంటనే విక్రమ్ సంపత్ పై సోషల్ మీడియా వేదికగా ఎదురుదాడి మొదలు పెట్టారు.
  విక్రం సంపత్ ను ట్రోల్ చేసే లెఫ్ట్ లిబరల్స్, ఇస్లామిక్ చరిత్రకారులు ఎమినెంట్ హిస్టోరియన్ అని పొగిడే ఇర్పాన్ హబిబ్ దీనికి నేతృత్వం వహిస్తున్నట్లుగా.., సోషల్ మీడియాలో ఆయన చేసిన ట్వీట్ ను చూస్తే అర్థం అవుతుంది.! ఈ ఇర్ఫాన్ హబిబే… హిందు వీరుల చరిత్రను తక్కువ చేసి…, కేవలం ముస్లింలు.. ఢిల్లీ సల్తనేట్, మొగల్స్ చరిత్రను గ్లోరీఫై చేసిన కుహనా చరిత్రకారుడనే విమర్శలు ఉన్నాయి. ఒక వ్యూహం ప్రకారం భారతీయ చరిత్ర వక్రీకరణల కుట్రలకు తెరలేపింది కూడా ఇర్పాన్ హబిబేననే ఆరోపణలున్నాయనే విషయం మనం మర్చిపోరాదు.
  అటు తనపై ఎదురుదాడిని మొదలు పెట్టిన లెఫ్ట్ లుటియన్స్ జర్నలిస్టులపై, కుహనా చరిత్రకారులపై విక్రమ్ సంపత్ కూడా తనదైన శైలీలో అదే సోషల్ మీడియా వేదికగా…అటాక్ మొదలు పెట్టారు.
  వామపక్ష చరిత్రకారుల కుట్రలను మరింత విస్తృతంగా బయటపెట్టారు. కొంతమంది తమకు తాము ప్రొఫెషనల్ చరిత్రకారులుగా పేర్కొంటున్నారని, తనను ట్రోల్ చేస్తు అప్రతిష్ఠపాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ట్వీట్ ద్వారా తెలిపారు విక్రమ్.! అయితే ఆ ప్రొఫెషనల్స్… ఎలా NCRT పుస్తకాల్లో వక్రీకరణలకు పాల్పడింది… పేజీలతో సహ బయటపెట్టాడు విక్రమ్ సంపత్.!
  ఏడవ తరగతి చరిత్ర పాఠ్యపుస్తకం చాప్టర్ రెండు, పేజీ నంబర్ 16లో రాష్ట్రకూటులు, పాండ్యులు మొదలైన దక్షిణ భారత రాజ వంశాల పేర్లను మాత్రమే పేర్కొనడం జరిగింది. అలాగే రాష్ట్రకూటులను, వారి బ్రాహ్మణపూజారులను ముర్ఖులుగా పేర్కొన్నారు. అదే చాఫ్టర్ లో చోళులు ప్రజలను అణిచివేశారని.. వారు 400 రకాల పన్నులు వేశారని రాయడం జరిగింది.
  నిజానికి మన దేశంలో జజియా ట్యాక్స్ ను మించిన అణిచివేత పన్ను ఇంకా ఏమి ఉంటుంది చెప్పండి.! వామపక్ష చరిత్రకారులు జిజియా ట్యాక్స్ అనగానే అదో జుట్టు పన్ను అంటు అసలు నిజాన్ని కప్పిపుచ్చారు.! ఒక ముస్లిం రాజ్యంలో ఎవరైనా పరాయి మతస్తులు…, తమ మత సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను కొనసాగిస్తూ జీవించాలంటే, ముస్లిం రాజులకు పన్నుకట్టాలి. ఇలా తమ పూర్వీకుల నుంచి వస్తున్న తమ హిందూ ఉనికిని కాపాడుకోవడం కోసం హిందూ సమాజం.., జిజియా ట్యాక్సులు కట్టి మరి హిందువులుగా జీవించారు.
  అలాగే 7 వ తరగతి పాఠ్యపుస్తకంలో చోళుల చరిత్రను కేవలం మూడు పేజీలకు పరిమితం చేసి…మహ్మద్ గజనీ గురించి తెలిపేందుకు ఎంతగానో ఆసక్తిని చూపించినట్లు మనకు అర్థమవుతుంది.
  ఢిల్లీ కేంద్రంగా ఏలిన హిందు రాజ్యాలను రెండు, మూడు పేజీలకే పరిమితం చేశారు. ఇక మూడో చాఫ్టర్ ను ఢిల్లీ సుల్తాన్లకు అంకితం చేశారు. అయితే ఈ చాఫ్టర్లలో ఢిల్లీ సుల్తాన్లు మన దేశంలో పారించిన రక్తపాతం..హిందువులపై వారు జరిపిన దౌర్జన్యాలను ఎక్కడా మచ్చుకైనా ప్రస్తావించలేదనే విషయాన్ని గమనించవచ్చు.
  అటు చాఫ్టర్ 4 ను పూర్తిగా మొగల్ సామ్రాజ్యానికి అంకితం చేయడం జరిగింది. ఐదో చాఫ్టర్ లో మొగల్ పాలకులు, వారు నివసించిన భవనాలు, నిర్మాణాలు, సమాధులు, మసీదులు, అక్కడక్కడ కొన్ని దేవాలయాల బొమ్మలు చూపారు. వీటిని 66 పేజీలో మనం చూడవచ్చు.
  ఇంకా ఏమిటంటే… శ్రీలంక బౌద్ధులపై…హిందువైన పాండ్య రాజు శ్రీమర శ్రీవల్లభుడు దాడులు చేశాడని, దేవాలయాలను ధ్వంసం చేశాడని.. చెప్పుకొచ్చారు.! విదేశీ ఇస్లామిక్ దురాక్రమణదారులు…హిందువులపై దాడులు చేసిన విషయాన్ని దాచిపెట్టిన, ఈ వామపక్ష చరిత్రకారులు.., శ్రీలంక బౌద్ధులపై హిందు రాజులు దాడులు చేశారని చెప్పడాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి.? హిందువులకు, బౌద్ధులకు మధ్య విభేదాలు సృష్టించడానికే అలా రాశారని ఎందుకు అనుకోకుడదో వామపక్ష చరిత్రకారులే చెప్పాలి.!
  మహ్మద్ గజనీ తన దండయాత్రలో హిందూ దేవాలయాలను ధ్వంసం చేయడం అసలు నేరమే కాదన్నట్లుగా రాశారు. మధ్య యుగాలలో ఓడిపోయిన రాజ్యంలోని ప్రజల మీద పడి దోచుకోవడం, అక్కడి మందిరాలను ధ్వంసం చేయడం, సంపదను లూటి చేయడం సర్వసాధారణమనే విధంగా.., ఇస్లామిక్ దురాక్రమణదారులు జరిపిన దోపిడీని, విధ్వంసాలను జస్టిఫై చేసే ప్రయత్నం చేశారు.
  ఇక ఆరో చాఫ్టర్ లోని పేజీ నంబర్ 82 లో 16వ శతాబ్దంలో దక్షిణ భారతంలోని గొప్ప హిందూ సామ్రాజ్యంగా వెలుగొందిన విజయ నగర సామ్రాజ్యం, హస్తకళలు, రత్నాలను రాసులుగా పోసి అమ్మిన వైనాన్ని ఒక సైడ్ పేజీలో కవర్ చేశారు.
  అటు ఏడో చాఫ్టర్ లో పేజీ నంబర్ 99-100లో అసాంలోని గిరిజనులు, సంచార జాతుల ప్రస్తావనలు చేశారు. 1662లో మొఘల్ సైన్యాలు అహోమ్ రాజులను ఓడించిన తీరును వివరించారు.
  అయితే ఆ తర్వాత 1671లో సరైఘాట్ యుద్ధంలో అహోమ్ రాజుల సేనాధిపతి లాచిత్ బడ్ పుకాన్…మొఘలులను ఓడించిన విషయాన్ని మాత్రం వామపక్ష చరిత్రకారులు చెప్పడం మర్చిపోయారు. అలాగే ఎనిమిదో అధ్యాయంలో భక్తి ఉద్యమాన్ని, సూఫీ ఉద్యమాన్ని తక్కువ చేసి చూపే ప్రయత్నం చేశారు.
  తొమ్మిదో చాఫ్టర్ విషయానికి వస్తే… మేకింగ్ ఆఫ్ రీజనల్ కల్చర్ అన్నారు. దేశంలో ప్రాంతీయవాదాన్ని ప్రొదిచేసేలా ఈ అధ్యాయాన్ని రూపొందించినట్లుగా అర్థం అవుతుంది. మొగలులు ఈ ప్రాంతాలన్నిటీని ఏకం చేసి మొదటిసారిగా దేశమనే కాన్సెప్టును ఇచ్చారనే విధంగా చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు.
  చాఫ్టర్ పదిలో అయితే నాదిర్ షా, నిజాం ఉల్ ముల్క్, అవధ్ నవాబుల వివరాలు ఉన్నాయి. కానీ అదే ఛత్రపతి శివాజీ గురించి మాత్రం సింగిల్ కాలమ్ కు పరిమితం చేశారు. దీంతో ఏడో తరగతి చరిత్ర పుస్తకం ముగుస్తుంది.
  వామపక్ష చరిత్రకారులు వక్రీకరించిన ఈ NCERT పుస్తకాలు ఆన్ లైన్ లో డౌన్ లోడ్ చేసుకుని మరింత విస్తృతంగా కూడా పరిశీలించవచ్చు. ఆ లింక్స్ ను మీకోసం ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మేము జత చేస్తున్నాం.
  ఇప్పుడు విక్రం సంపత్ ను వామపక్ష చరిత్రకారులు ట్రోల్ చేస్తున్న మరో అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
  అది వీర సావర్కర్ క్షమాభిక్ష కు సంబంధించిన అంశం.! ఢిల్లీలోని అంబేద్కర్ ఇంటర్నేషనల్ కేంద్రంలో అక్టోబర్ 13వ తేదీన ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో…, కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్, అలాగే ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ మోహన్ జీ భగవత్ పాల్గొన్నారు.
  ఈ సందర్భంగా ఉదయ్ మహుర్కర్, చిరాయు పండిట్ లు రాసిన Veer Savarkar: The Man Who Could Have Prevented Partition అనే గ్రంథాన్ని అవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ… వీరసార్కర్ పై మార్క్సిస్టు చరిత్రకారులు కుట్రపూరితంగా అనేక అసత్యాలను కట్టుకథలను ప్రచారం చేశారని అన్నారు. వీర్ సావర్కర్… ఆంగ్లేయులకు సరెండర్ అయ్యారనే ప్రచారంలో వాస్తవం లేదని.. , నిజానికి మహాత్మాగాంధీ కోరిక మేరకే సావర్కర్ క్షమాభిక్షపై నిర్ణయం తీసుకున్నాడని రాజ్ నాథ్ తెలిపారు.
  అయితే కేంద్రమంత్రి తెలిపిన ఈ వివరాలకు అసలు ఆధారాల్లేవని.., ఉంటే ఆధారాలు చూపాలంటూ వామపక్ష చరిత్రకారుడు ఇర్పాన్ హబిబ్ ట్వీట్ చేయడంతో వివాదం రాజుకుంది. అయితే దీనికి విక్రం సంపత్ తనదైన స్టయిల్లో కౌంటర్ ఇచ్చారు. అందుకు సంబధించిన చారిత్రక సాక్ష్యాలను బయటపెట్టి.. ఇర్పాన్ హబిబ్ నోరు మూయించాడు.
  సావర్కర్ మెర్సి పిటిషన్ కు సంబంధించిన వివాదంపై విక్రం సంపత్ తాను రాసిన Savarkar: A Contested Legacy మొదటి వాల్యుమ్ లో కొట్ చేయడం జరిగింది.
  గాంధీజీ కోరిక మేరకే…సావర్కర్ మెర్సీ పీటిషన్ దాఖలు చేశారని ఆధారాలతో సహా తెలిపారు విక్రమ్ సంపత్.! మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత, బ్రిటీష్ ప్రభుత్వం దేశంలో మాంటెంగ్ చెమ్స్ ఫర్డ్ సంస్కరణల చట్టం తీసుకువచ్చింది. ఈ క్రమంలో దేశమంతట శాంతియుత వాతావరణం నిర్మాణం కావాలనే తలంపుతో, బ్రిటీష్ ప్రభుత్వం 1920 లో గాంధీజీతో సంప్రదింపులు జరిపింది. గాంధీజీ చేసిన విజ్ఞప్తి మేరకు రాజకీయ ఖైదీలను విడుదల చేసేందుకు అంగీకరించింది.
  రాజకీయ ఖైదీలు అందరూ తమను జైలు నుంచి విడుదల చేయాలని కోరుతూ, బ్రిటీష్ ప్రభుత్వానికి అర్జీ పెట్టుకునేలా, ఆంగ్లేయ ప్రభుత్వమే…ఓ మెర్సి పిటిషన్ ఫార్మాట్ ను రూపొందించింది. ఈ పిటిషన్లపై సంతకాలు తీసుకున్న తర్వాత రాజకీయ ఖైదీలను బ్రిటీష్ ప్రభుత్వం విడిచి పెట్టింది.
  అయితే దేశ వ్యాప్తంగా రాజకీయ ఖైదీలను విడుదల చేసిన తర్వాత కూడా వీర సావర్కర్ తోపాటు అతని అన్న గణేశ్ సావర్కర్ లను మాత్రం బ్రిటీష్ ప్రభుత్వం అండమాన్ జైలు నుంచి విడుదల చేయలేదు. వారితో తమకు ముప్పు పొంచివుందని భావించిన ఆంగ్లేయ ప్రభుత్వం వారిని డేంజర్ కేటగిరిలో చేర్చింది.
  దీంతో 1920లో వీర సావర్కర్ తమ్ముడు నారాయణ రావు…తమ సోదరుల విడుదలకు సాయం చేయాలని గాంధీజీని కలిసి కోరడం జరిగింది. 1920 జనవరి 25న గాంధీజీ.., సావర్కర్ సోదరుడు.. నారాయణ్ రావు లేఖ రాయడం జరిగింది. ఆ లేఖలో మీ ఇద్దరు సోదరులు కూడా విడుదల చేయాలని కోరుతూ, బ్రిటీష్ ప్రభుత్వానికి పిటిషన్ దాఖలు చేయాలని చెప్పారు.
  ఆరు నెలల తర్వాత 1920 మే 26వ తేదీన గాంధీజీ కూడా యంగ్ ఇండియా పత్రికలో… సావర్కర్ బ్రదర్స్ పేరుతో ఒక వ్యాసాన్ని కూడా రాశారు. సావర్కర్ సోదరులు ఎంతో ధైర్యవంతులైన దేశభక్తులని.., వారు దారితప్పారని, హింసామార్గం వైపు వెళ్లారని.., ఇప్పుడు వారు శాంతియుత మార్గంలో కాంగ్రెస్ తో కలిసి ఉంటారని ఆ వ్యాసంలో పేర్కొన్నారు.!
  సావర్కర్ అనేక సార్లు పిటిషన్లు దాఖలు చేసిన మాట వాస్తవమే. అయితే అది తన విడుదల కోసం మాత్రం కాదు. 1917లో తనకు సాయపడ్డారనే నేరారోపణలలో ఎంతో మంది అమాయకులైన యువకులను సైతం అరెస్టు చేశారని, వారిని విడుదల చేయాలని సావర్కర్ కోరడం జరిగింది. 1920లో మాత్రం గాంధీజీ సూచన తర్వాత…అండమాన్ జైలులో ఉండిపోరాడే కంటే…, మహారాష్ట్రలో ఉంటూ యువకులను స్వాతంత్ర్యోద్యమంలో కార్యోన్ముకుల్ని చేయాలని సావర్కర్ భావించారు. కలెక్టడ్ వర్క్స్ ఆఫ్ మహాత్మాగాంధీజీ 19వ వాల్యుమ్ లో సావర్కర్ సోదరుల విడుదల కోసం గాంధీజీ.., నారాయణ రావుకు రాసిన లేఖలను మనం ఇప్పటికి చూడవచ్చు.
  విక్రమ్ సంపత్ బయటపెట్టిన ఆధారాల తర్వాత నోటమాట రానీ లెఫ్ట్ లిబరల్ లుటియెన్స్ చరిత్రకారులు.., వీకీపీడియాను బేస్ చేసుకుని విక్రం సంపత్ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కుట్రలు మొదలు పెట్టారు.
  వీకీపీడియాలో విక్రం సంపత్ పేజీలో లెఫ్ట్ లీనింగ్ పబ్లికేషన్ కు చెందిన కొంతమంది ఎడిటర్లు … సంపత్ ను హిందు మతోన్మాదిగా…, హిందుత్వ అనుకూల ఫాసిస్ట్ గా చిత్రీకరించే ప్రయత్నంచేస్తున్నారని., అందుకోసం కొంతమంది పెయిడ్ ఎడిటర్లను సైతం రంగంలోకి దించినట్లుగా తెలుస్తోందని ఓ నెటిజన్ ఆందోళన వ్యక్తం చేశాడు.
  జార్జ్ సోరాస్ ఎన్జీవో సంఘాల నుంచి వీకిపిడియాకు భారీగా నిధులు అందుతున్న విషయం మనకు తెలిసిందే.
  వక్రీకరించబడ్డ చరిత్రను ఆధారాలతో సహా నిరూపిస్తూ… జాతీయ మాధ్యమాల్లో తనదైన శైలీలో జాతీయవాద దృక్పథాన్ని సమర్థవంతంగా వివరిస్తున్న విక్రమ్ సంపత్ క్రెడిబిలిటీని ప్రశ్నార్థాకం చేయడానికి ఒక పకడ్బందీ ప్రణాళిక జరుగుతోంది.
  సాధారణంగా విక్రమ్ సంపత్ లాంటి ఎక్స్ పర్ట్స్ వ్యాఖ్యలను మాధ్యమాల్లో చూసి అతని గురించి సెర్చ్ చేస్తే మొదట మనకు దర్శనమిచ్చేది వికీపీడియా. ప్రముఖులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని పొందుపరిచే వికీపిడియాకి దేశ వ్యతిరేకి, జాతీయవాదాన్ని అణిచివేయాలని కంకణం కట్టుకున్న జార్జ్ సారోస్ కి చెందిన సంస్థలు భారీగా నిధులు విడుదల చేస్తాయి.
  అయితే వికీపిడియాలో విక్రమ్ సంపత్ క్రెడిబిలిటిని తగ్గించే విధంగా ఆయన ప్రొఫెల్ ని ఎడిట్ చేయాలంటే… ఏదైనా వార్తా పత్రికలో పెరెన్నికగన్న చరిత్రకారుడు రాసిన వ్యాసాలను ట్యాగ్ చేయాల్సి ఉంటుంది. సో విక్రమ్ సంపత్ వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయన విశ్వసనీయతను తగ్గించే విధంగా ఇర్ఫాన్ హబిబ్ లాంటి వారు వ్యాసాలు రాస్తారు.
  దాన్ని బేస్ చేసుకుని విక్రమ్ సంపత్ వికీపీడియా పేజ్ లో ఎడిట్స్ చోటు చేసుకుంటాయి.
  అదే మార్క్సిస్టు చరిత్రకారుల కుట్రపూరిత విధానం స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి చరిత్రను పూర్తిగా తమకు అనుకూలంగా రాసుకుని అదే పనిగా ప్రజలపై రుద్ది…హిందూ సమాజాన్ని టార్గెట్ చేసే ఈ కుహనావాదులకు సమాధానం… సామాజిక చైతన్యమే.
  విక్రమ్ సంపత్ లాంటివారిని కాపాడుకోవడం మనందరి బాధ్యత.

  Trending Stories

  Related Stories