More

    వారు ఏ భాష మాట్లాడితే బీజేపీ కూడా అదే భాష మాట్లాడుతుంది: విజయశాంతి

    ఎమ్మెల్సీ కవిత వ్యవహారశైలిపై బీజేపీ నేత విజయశాంతి తీవ్ర విమర్శలు చేశారు. ఆమె వీధి రౌడీలా మాట్లాడుతోందని.. అర్వింద్ ఇంటిపై దాడి జరగడం దురదృష్టకరమన్న ఆమె.. టీఆర్ఎస్ చర్యను తీవ్రంగా ఖండించారు. కేసీఆర్ తన బిడ్డలకైనా మంచి బుద్దులు నేర్పి ఉంటే బాగుండేదని.. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు ఇప్పటికైనా నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హితవు పలికారు. వారే ఏం భాష మాట్లాడితే బీజేపీ కూడా అదే భాష మాట్లాడుతుందన్నారు. ఇలాంటి దాడుల్ని సహించబోమని.. ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తే వాటికి సమాధానం చెప్పాల్సింది పోయి దాడులు చేయడమేంటని విజయ శాంతి ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో ఆటవిక పాలన నడుస్తోందనడానికి బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటిపై దాడి చేసిన ఘటనే నిదర్శనం అని విజయశాంతి అన్నారు. విమర్శలకు జవాబు చెప్పడం చేతకాక ప్రజా ప్రతినిధి అయిన అర్వింద్ ఇంటిపై గుండాలతో దాడి చేయించడంతో పాటు ఎంపీ తల్లిని, ఇంట్లో ఉన్న వారిని భయభ్రాంతుల్ని చేయడం చూస్తుంటే రాష్ట్రంలో ఎలాంటి అరాచక, అనాగరిక పరిస్థితులు నెలకొన్నాయో స్పష్టం అవుతోందన్నారు. మహిళ రక్షణ గురించి పదే పదే చెప్పుకునే టీఆర్ఎస్ సర్కార్ ఈ ఘటన ద్వారా ఇక ఆ మాట ఎత్తే అర్హతను పూర్తిగా కోల్పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

    Trending Stories

    Related Stories