More

    విజయవాడలో ఫుట్ బాల్ ప్లేయర్ దారుణహత్య

    విజయవాడలో ఫుట్ బాల్ ప్లేయర్ ను అతి దారుణంగా హత్య చేశారు. గురునానక్ కాలనీలో జక్కంపూడికి చెందిన ఫుట్ బాల్ ప్లేయర్ ఆకాశ్ దారుణ హత్యకు గురయ్యాడు. రౌడీ షీటర్ టోనీ రెండు రోజుల క్రితం వాంబే కాలనీలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. టోనీ గ్యాంగ్ లో ఆకాశ్, ప్రభాకర్ తో పాటు మరి కొందరు పని చేస్తున్నారు. టోనీ అంత్యక్రియల తర్వాత అందరూ కలిసి ఓ బార్ లో మద్యం సేవించారు. ఈ సందర్భంగా ఆకాశ్, ప్రభాకర్ గ్రూపుల మధ్య వివాదం తలెత్తింది. అంతలోనే అక్కడకు పోలీసులు రావడంతో అందరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ విషయాన్ని మనసులో పెట్టుకుని గత రాత్రి ప్రభాకర్ గ్యాంగ్ ఆకాశ్ ఇంటి వద్దకు వెళ్లి అతనిపై కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో ఆకాశ్ అక్కడిక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటి వరకు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

    Trending Stories

    Related Stories