రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీ అనుకూల మీడియా దుష్ప్రచారం చేస్తోందని ఎంపీ, వైఎస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు. ఈనాడు దాని అనుబంధ కుల పత్రికలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. విషపు రాతలతో కొత్తదారులు అన్వేషిస్తున్నారని, ఇంత దిగజారుడుతనాన్ని ప్రదర్శించటం శోచనీయమన్నారు. విశాఖపట్నంలో విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్రకు ద్రోహం చేసే కుట్రలు సాగుతున్నాయన్నారు.
రామోజీ, చంద్రబాబుకు సవాల్..
ఆస్తులపై సీబీఐ, ఈడీ విచారణకు తాను సిద్ధమని, రామోజీ, చంద్రబాబు సిద్ధమేనా అంటూ సవాల్ విసిరారు విజయసాయిరెడ్డి. విచారణ జరిగితే ఎవరు జైలుకు వెళ్తారో తెలుస్తుందన్నారు. మీడియా రంగంలోకి నేను వస్తున్నా.. రామోజీ చేసుకుందాం అని అన్నారు.