Telugu States

ప్రపంచంలోనే అతి పెద్ద స్కామ్ ‘అమరావతి’: విజయసాయి రెడ్డి

రాష్ట్ర ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా ప్లీనరీ జరిగిందని అన్నారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. దేశ చరిత్రలో అణగారిన వర్గాలకు ఇంత ప్రాధాన్యత ఎప్పుడూ ఇవ్వలేదని.. ప్రపంచమంతా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను ప్రసంసిస్తున్నారన్నారు విజయసాయిరెడ్డి. చంద్రబాబు విమర్శలు ఆయన భావ దారిద్రానికి నిదర్శనం అని.. ప్లీనరీకి 9 లక్షల మంది వచ్చినట్లు తెలుస్తోందని, ఇది చూసి చంద్రబాబు మెదడులో చిప్పు బయటకు వచ్చిందని విజయసాయి రెడ్డి చెప్పుకొచ్చారు. ఇక 2024లో వైసీపీ విజయం తరువాత పూర్తిగా మెదడు పోవడం ఖాయమని అన్నారు.టీడీపీ మహానాడులో తిట్టడం, తొడలు కొట్టడం ప్రధాన ఘట్టంగా సాగిందని.. వైసీపీ ప్లీనరీలో ఏం చేశాం.. రాబోయే రోజుల్లో ఏం చేస్తామన్నదే చెప్పామన్నారు. చంద్రబాబు శాడిస్టు, సైకోలా ప్రవర్తిస్తున్నాడని.. అమరావతి ప్రపంచంలోనే అతి పెద్ద స్కామ్ అని విమర్శించారు. రెండు పార్టీల్లో ఉండకూడదనే కారణంతోనే విజయమ్మ రాజీనామా చేశారని అన్నారు. ప్లీనరీకి వచ్చి ప్రాణాలు కోల్పోయిన దినేష్‌కు రూ. 5 లక్షల ఆర్థిక సాయాన్ని పార్టీ తరఫున అందజేస్తామని విజయసాయిరెడ్డి వెల్లడించారు.

Related Articles

Back to top button