More

    సాగర్ పోరులో విజయశాంతికి పెద్ద టాస్కే ఇచ్చిన బీజేపీ..?

    విజయశాంతిని తమ పార్టీ తరపున స్టార్ క్యాంపెయినర్‌గా ఉపయోగించుకోవాలని యోచిస్తున్న బీజేపీ.. ఉప ఎన్నికల ప్రచారంలో ఆమెను సాగర్ నియోజకవర్గం చుట్టేలా చూడాలని ప్లాన్ చేసుకుంటోంది. తెలంగాణ యాసలో అధికార టీఆర్ఎస్‌ను విమర్శించడంలో విజయశాంతి దూసుకుపోతుంటారు. ఆమెకు తోడుగా మరికొందరు నేతలను సైతం సాగర్‌లో మోహరించి.. టీఆర్ఎస్‌ను టార్గెట్ చెయ్యాలని బీజేపీ అనుకుంటోందని తెలుస్తోంది.

    త్వరలో ఎమ్మెల్సీ, వెనువెంటనే నాగార్జున సాగర్ ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో తెలంగాణలో మళ్లీ రాజకీయ వేడి రాజుకుంది. పార్టీల వ్యూహాత్మక నిర్ణయాలు, ప్రచార వేగాలు ఊపందుకుంటున్నాయి. ఇటు రెండు ఎమ్మెల్సీ స్థానాలు అటు ఒక ఎమ్మెల్యే.. మొత్తం మూడింటిని తన ఖాతాలో వేసుకునేందుకు రాష్ట్ర భాజపా తీవ్ర కసరత్తు చేస్తుంటే.. అలాంటి అవకాశం మళ్లీ కలుగనీయకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది అధికార పార్టీ.. ఇక కాంగ్రెస్ కూడా తన పని తాను చేసుకుని ఈసారైన కూసింత మార్క్ క్రియేట్ చేయాలనుకుంటోంది.

    నాగార్జున సాగర్ ఉప ఎన్నికను సీరియస్ గా తీసుకున్న బీజేపీ అభ్యర్ధి ఎంపికకకు సంబంధించి ఎన్నో కసరత్తులు, సర్వేలు చేయించదని సమాచారం. ప్రత్యర్ధి బట్టి ఇటు అభ్యర్ధితి దింపేందుకు అంతా సిద్ధం చేసుకుందట.

    ఇదిలా ఉంటే నాగార్జునసాగర్‌లో పార్టీ ఎన్నికల ప్రచారం ఏ రకంగా ఉండాలనే దానిపై ఫోకస్ పెట్టారు బీజేపీ నాయకులు. గతంలో ఇక్కడ ఆ పార్టీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది కనుక ఈసారి అక్కడ మెరుగైన ఫలితాలు సాధించాలంటే.. ప్రచార హోరు జనాల జోరు పెంచాల్సిందేనని డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలో తమ పార్టీ తురుపుముక్కగా విజయశాంతిని బరిలోకి దించాలని బీజేపీ భావిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

    విజయశాంతిని తమ పార్టీ తరపున స్టార్ క్యాంపెయినర్‌గా ఉపయోగించుకోవాలని యోచిస్తున్న బీజేపీ.. ఉప ఎన్నికల ప్రచారంలో ఆమెను సాగర్ నియోజకవర్గం చుట్టేలా చూడాలని ప్లాన్ చేసుకుంటోంది. తెలంగాణ యాసలో అధికార టీఆర్ఎస్‌ను విమర్శించడంలో విజయశాంతి దూసుకుపోతుంటారు. ఆమెకు తోడుగా మరికొందరు నేతలను సైతం సాగర్‌లో మోహరించి.. టీఆర్ఎస్‌ను టార్గెట్ చెయ్యాలని బీజేపీ అనుకుంటోందని తెలుస్తోంది.

    అసలీ గొడవంతా లేకుండా సాగర్ అభ్యర్ధిగానే విజయశాంతిని ప్రకటిస్తే బాగుంటదని తొలుత భావించిన.. స్థానికేతర అంశం ప్రత్యర్ధులకు బలమైన అస్త్రంగా మారే అవకాశం ఉందని ఆ నిర్ణయాన్ని పక్కన పెట్టారట. దాని బదులు అక్కడ ప్రధాన ప్రచార కర్తగా బరిలోకి దింపి ఫలితం పొందాలనుకుంటున్నారు.

    ఇది పర్సనల్ గా విజయశాంతికి ఒక టాస్క్ అంటున్నారు విశ్లేషకులు. భాజపా సాగర్ లో అధికారం లోకి వస్తే సరి.. మరి రాకుంటే ఆ బరువు మోయాల్సింది రాములమ్మేనా అని అంటున్నారట. ఇదే నిజమైతే భవిష్యత్తులో విజయశాంతి భాజపా ప్రస్థానానికి సాగర్ బలమైన పునాది కానుందని తెలుస్తుంది. ఇంకొన్ని దినాలాగితే దీనికి సమాధానం దొరుకుతుంది మరి.

    Related Stories