More

    దగ్గుతూనే కనిపించిన కేజ్రీవాల్.. టెన్షన్ లో అందరూ..!

    కొద్దిరోజుల కిందట ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే..! అయితే ఆయనకు చాలా తొందరగానే నయమైందని ప్రకటించారు. కానీ ఇటీవల ఎన్నికల పర్యటనల కోసం కేజ్రీవాల్ వెళ్లగా అక్కడ దగ్గుతూనే కనిపించడంతో అందరి లోనూ టెన్షన్ మొదలైంది. కోవిడ్ నుండి కోలుకున్నట్లు ప్రకటించిన తరువాత అరవింద్ కేజ్రీవాల్ బహిరంగ సభలలో మాస్క్ లేకుండా మాట్లాడటం.. నిరంతరం దగ్గుతున్న అనేక వీడియో రికార్డింగ్‌లు కనిపించాయి. అన్ని వీడియో క్లిప్‌లలో కేజ్రీవాల్ ఇతరులతో మాట్లాడేటప్పుడు పదేపదే దగ్గుతూ ఉండడాన్ని గమనించవచ్చు.

    https://twitter.com/kaajukatla/status/1483341894231130117

    కేజ్రీవాల్‌కు జనవరి 4న కోవిడ్‌ సోకింది. రోగ నిర్ధారణ జరిగిన 5 రోజుల తర్వాత, జనవరి 9వ తేదీన తనకు తాను వైరస్ నుండి బయటపడినట్లు ప్రకటించుకున్నారు. పరీక్షలు నెగెటివ్ వచ్చిన తర్వాత కూడా లక్షణాలు కొనసాగితే, కనీసం ఒక వారం లేదా పది రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండాలని ICMR సిఫార్సు చేస్తుంది. కానీ అవేవీ పట్టించుకోలేదు కేజ్రీవాల్. ఎన్నికల్లో ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నారు. ప్రజలతో మాట్లాడేటప్పుడు దగ్గుతున్నట్లు కనిపించారు. పలు ట్విట్టర్ వినియోగదారులు కేజ్రీవాల్ అనారోగ్యంతో ఉన్నప్పటికీ గోవాలో ప్రచారం చేస్తున్న వీడియోలను ట్వీట్ చేశారు.

    పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్ మాన్‌తో సహా చాలా మంది వ్యక్తులతో ఒక వేదికపై కేజ్రీవాల్ ఉన్న వీడియో కూడా వైరల్ అవుతూ ఉంది. “కేజ్రీవాల్ జీ, మాస్క్ ధరించండి. ర్యాలీ అయినా, ఇంటర్వ్యూ అయినా, ప్రెస్ కాన్ఫరెన్స్ అయినా ఎక్కడ చూసినా కేజ్రీవాల్ దగ్గుతూనే కనిపిస్తున్నారు. కేజ్రీవాల్ గారూ మీ ఆరోగ్యం చెడిపోయి ఉంటే ఇంట్లో విశ్రాంతి తీసుకోండి దేశం #Covid19తో పోరాడుతున్నప్పుడు కూడా ఇతరుల ప్రాణాలను ఎందుకు పణంగా పెడుతున్నారు.” అంటూ పలువురు ఆయన తీరును విమర్శిస్తూ ఉన్నారు. “అరవింద్ కేజ్రీవాల్ కోవిడ్ నుండి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఇంట్లో ఐసోలేషన్ లో ఉండటానికి బదులుగా, ఆయన పంజాబ్‌లో (భౌతికంగా) ప్రచారం చేస్తున్నారు. కేవలం 4 రోజులు మాత్రమే క్వారంటైన్‌లో ఉన్నారు. ఈ వీడియోల్లో ఆయన మాస్క్ లేకుండా బహిరంగంగా దగ్గుతున్నారు. కేజ్రీవాల్ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, వేల మంది జీవితాలను ప్రమాదంలో పడేస్తున్నారు” అని మరికొందరు విమర్శించారు.

    https://twitter.com/MeghBulletin/status/1482670115330326528

    అరవింద్ కేజ్రీవాల్ నిర్లక్ష్య వైఖరి

    గత నెలలో, కేజ్రీవాల్ తన పార్టీకి ప్రచారం చేయడానికి గోవా, పంజాబ్ వంటి రాష్ట్రాలకు పదేపదే పర్యటించారు. ఢిల్లీలో పెరుగుతున్న కోవిడ్ కేసులపై ఆందోళన వ్యక్తం చేసేందుకు ఢిల్లీ సీఎం పలు విలేకరుల సమావేశాల్లో మాట్లాడారు. ప్రజలకు కూడా సూచనలు చేశారు. అయితే తన ఎన్నికల ర్యాలీలు, ప్రెస్ కాన్ఫరెన్స్‌లలో మాత్రం COVID భద్రతా నియమాలను పాటించలేదు. మాస్క్ లేకుండా అందరితో ముచ్చటించడాన్ని గమనించవచ్చు. కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఓమిక్రాన్ కారణంగా దేశవ్యాప్తంగా COVID-19 సంక్రమణ పెరుగుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నాన్‌స్టాప్‌గా ఎన్నికల కోసం ప్రచారం చేస్తున్నారు, ఆయన ప్రవర్తన కారణంగా చాలా మంది జీవితాలు ప్రమాదంలో పడ్డాయని తెలుస్తోంది.

    Trending Stories

    Related Stories