Telugu States

చింతమనేని వీడియోను విడుదల చేసిన పోలీసులు

కోడి పందేల కేసులో తన పేరు వినిపించడాన్ని టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఖండించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ శివారులో కోడి పందేల స్థావరంపై పోలీసులు జరిపిన దాడుల్లో తప్పించుకుని పారిపోయారంటూ తనపై జరుగుతున్న ప్రచారాన్ని తప్పు పట్టారు. ‘కోడి పందాల్లో లేని వ్యక్తిని ఉన్నట్లుగా చూపడం మీ జెండా అజెండా. ఇంత రాక్షస రాజకీయం అవసరమా. రాజకీయాన్ని రాజకీయంగానే ఎదుర్కోండి. ఈ దుర్మార్గపు నీచమైన ప్రచారాన్ని ఇకనైనా ఆపండి. ఈ నీచపు ప్రచారంతోనే కుప్పకూలే మేడలు కట్టి అధికారంలోకి వచ్చారు. తెలుగు ప్రజల్లో విష బీజాలు నాటి నాడు అధికారంలోకి వచ్చారు. ఆ మేడ కూలిపోయే సమయం ఆసన్నమైంది. మీ అసత్యాలు ప్రజలు కూకటివేళ్లతో ప్రక్షాళన చేసే సమయం ఆసన్నమైంది. ఆరోజు కోసమే తెలుగు ప్రజలు ఎదురుచూస్తున్నారు. మీ రాజకీయ వికటాట్టహాసానికి ముగింపు త్వరలోనే. మీ చింతమనేని ప్రభాకర్.’ అంటూ హెచ్చరించారు చింతమనేని.

పటాన్ చెరు డీఎస్పీ భీమ్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసుల బృందం కోడిపందేల కేంద్రం పై దాడి చేశారు. పోలీసుల రాకను గమనించిన పలువురు చెట్ల పొదలలో దూరి పరారయ్యారు. వీరిలో ఏపీలోని దెంద‌లూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయ‌కుడు చింత‌మ‌నేని ప్రభాకర్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ప‌టాన్‌చెరు పోలీసులు కోడిపందేల సమయంలో తీసిన వీడియోలను విడుద‌ల చేశారు. అందులో చింతమనేని ప్రభాకర్ కనిపించారు. ఈ వీడియోలో కోడి పందేలు నిర్వ‌హిస్తున్న ప్రాంతంపై పోలీసులు దాడి చేసిన స‌మ‌యంలో అక్క‌డి నుంచి వెళ్లిపోతున్న చింత‌మ‌నేని దృశ్యాలు క‌నిపిస్తున్నాయి.

Related Articles

Back to top button