వాస్తవాలు వెలుగులోకి వస్తుంటే ఓవైసీకి ఉలుకెందుకు: VHP ప్రచార సహ ప్రముఖ్ బాలస్వామి

0
940

ప్రఖ్యాత జ్ఞానవాపి మందిరం విషయంలో ఎం.ఐ.ఎం అధినేత, హైదరాబాద్ ఎం.పీ అసదుద్దీన్ ఓవైసీ తీరు చూస్తుంటే జాలి వేస్తోందని విశ్వ హిందూ పరిషత్ ప్రచార సహ ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి అన్నారు. గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్టు వ్యవహరించడం సిగ్గుచేటని అన్నారు. ఇన్నాళ్లు మసీదుగా మార్చుకొని ఉన్న ప్రదేశంలో శివలింగంతో పాటు మిగతా నంది ,హిందూ కట్టడాలు బయటపడటం జీర్ణించుకోలేక ఓవైసీ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. తాను రాజ్యాంగంపై గౌరవం ఉన్న వ్యక్తిని అంటూనే… కోర్టు తీర్పులను తప్పు పడుతూ వ్యాఖ్యానించడం ఓవైసీకి తగదన్నారు.

ఉత్తరప్రదేశ్ వారణాసిలోని జ్ఞానవాపి మందిరం కాంప్లెక్స్ లో గల బావిలో పవిత్రమైన శివలింగం బయటపడింది. కోర్టు ఆదేశాల మేరకే ఆ ప్రాంతంలో వీడియోగ్రఫీ సర్వే చేస్తుండగా సోమవారం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ శుభ పరిణామాన్ని ప్రపంచమంతా ఆహ్వానించిందని అన్నారు. అయితే కోర్టు తీర్పును ధిక్కరిస్తూ ఓవైసీ మాట్లాడడం రాజ్యాంగ విరుద్ధమని బాలస్వామి చెప్పుకొచ్చారు. అయోధ్యలోని బాబ్రీ మసీదు లాగా జ్ఞానవాపి మసీదును కానివ్వబోమని అసదుద్దీన్ వ్యాఖ్యానించడం సరికాదన్నారు. ఆయన ఆరోపణ, వ్యాఖ్యలు ఆయన మానసిక స్థితికి అద్దం పడుతున్నాయని అన్నారు. మోదీకి, యోగికి నేను భయపడను అంటూ మాట్లాడే ఆయన మాటల్లోనే భయం కనిపిస్తోందని తెలిపారు.

హిందువుల మనోభావాలు దెబ్బ తీసి, హిందూదేవాలయాలు, భూములు, ఆస్తులు కోల్పోయేలా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన చట్టం -1991 లోని సెక్షన్ 4 (2) వెంటనే సవరించి హిందూ దేవాలయాలను, హిందూ ఆస్తులను కాపాడాలన్నారు. ఆర్.ఎస్.ఎస్ ,బిజెపి కుట్రలు పన్ని అయోధ్య బాబ్రీ మసీదు లాక్కున్నాయని… వాటి తరహాలోనే జ్ఞానవాపి మసీదును లాక్కునేందుకు కుట్రలు పన్నుతున్నాయని ఓవైసీ ఆరోపించడం ఆయన అవివేకానికి నిదర్శనమని బాలస్వామి విమర్శించారు. అయోధ్యలో రామజన్మభూమి కోసం వందల సంవత్సరాల పోరాటం చేసి, లక్షలాది మంది హిందువులు ప్రాణత్యాగం చేసి,చివరకు న్యాయబద్ధంగా రామ జన్మభూమిని సొంతం చేసుకున్నామనే విషయం ఓవైసీ తెలుసుకోవాలన్నారు. ముమ్మాటికీ జ్ఞాన వాపి అనేది మందిరమేనన్నారు. న్యాయబద్ధంగా పోరాడి మందిరాన్ని సాధించుకు తీరుతామని… మొగలుల పాలనలో ధ్వంసమైన దేవాలయాల గురించి మాత్రమే మా పోరాటమని బాలస్వామి తెలిపారు.