More

    వి.హెచ్.పి. నేత హత్య ఘటన.. నిందితుడు యూనస్ అన్సారీ అరెస్ట్

    డిసెంబర్ 15న జార్ఖండ్‌లోని రాంచీలో హత్యకు గురైన విశ్వహిందూ పరిషత్ (విహెచ్‌పి) నాయకుడు ముఖేష్ సోనీ హత్య కేసులో యూనస్ అన్సారీ అనే వ్యక్తిని జార్ఖండ్ పోలీసులు అరెస్టు చేశారు. డిసెంబరు 19 న రాంచీలో ప్రెస్‌ మీట్ పెట్టిన పోలీసు సూపరింటెండెంట్ దేహత్ నౌషాద్ ఆలం మాట్లాడుతూ హత్య జరిగినప్పటి నుండి పరారీలో ఉన్న మరో నిందితుడు ప్రిన్స్ ఖాన్‌ను పట్టుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. ప్రస్తుతం పోలీసులు యూనస్ అన్సారీని అరెస్టు చేసినట్లు తెలిపారు.
    విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ ఖలారీ బ్లాక్ ప్రెసిడెంట్‌గా ఉన్న ముఖేష్ సోనీపై కాల్పులు జరిపిన రోజు తన నగల దుకాణాన్ని మూసివేసి ఇంటికి తిరిగి వస్తున్నారని ఎస్పీ మీడియాకు తెలిపారు. ఈ సంఘటన ఖలారి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంచీలోని మెక్‌క్లస్కీగంజ్ పట్టణానికి సమీపంలోని బైపాస్ రోడ్‌లో జరిగింది. కేసు చాలా సున్నితమైనది కాబట్టి, కేసును ఛేదించడానికి సిట్‌ను ఏర్పాటు చేశామని, మృతుడి తండ్రి వాంగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేశామని, యూనస్ అన్సారీ, ప్రిన్స్ ఖాన్ ఇద్దరినీ నిందితులుగా పేర్కొన్నట్లు ఎస్పీ తెలిపారు.

    యూనస్ అన్సారీ ఉపయోగించిన మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని, ఈ కేసులో ఇతర కీలకమైన సాక్ష్యాలను సేకరించినట్లు ఎస్పీ తెలిపారు. ఈ ఆధారాలను కోర్టు ముందు హాజరు పరుస్తామని ఆయన తెలిపారు. ప్రిన్స్ ఖాన్‌ను ఇంకా పట్టుకోలేదని, అతని కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. ఎస్పీ నౌషాద్ ఆలం మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఘటనకు ముఖేష్, యూనస్ మధ్య పాత వివాదమే ప్రధాన కారణమని విచారణలో తేలిందని చెప్పారు. ముఖేష్ సోనీ ఫిర్యాదు మేరకు యూనస్ అన్సారీ ఇంటిని కూల్చివేశారని, దీని కారణంగా విహెచ్‌పి నేతపై పగ పెంచుకున్నారని ఆయన ధృవీకరించారు.

    పోలీసులు అవినీతికి పాల్పడ్డారు: ముఖేష్ సోనీ సోదరుడు
    కొన్నేళ్ల క్రితం యూనస్ అక్రమ ఆయుధాల ఒప్పందం కేసులో పట్టుబడకుండా తప్పించుకున్నారని ముఖేష్ సోనీ సోదరుడు తెలిపారు. ఆ సమయంలో కూడా యూనస్‌పై కేసు (నంబర్ 94/21) నమోదైంది. తన అక్రమ ఆయుధాల ఒప్పందం గురించి ముఖేష్ సోనీ పోలీసులకు చెప్పినట్లు యూనస్ అనుమానించారు. అయితే తన ఇంటి కూల్చివేతపై సోనీపై ఉన్న పగతో ఈ దారుణ ఘటన చోటుచేసుకుందని ఎస్పీ తెలిపారు. యూనస్ అన్సారీ మామ నివసించే అదే ఇంట్లో అతని సోదరుడు ముఖేష్ హత్య చేయబడిందని మాకు చెప్పారు. ఎస్‌హెచ్‌ఓ ఖలారీ ఫరీద్ ఆలం పై కూడా ఆరోపణలు గుప్పించారు సాగర్ సోనీ. తన కుటుంబ సభ్యులు ఎస్‌హెచ్‌ఓపై ఫిర్యాదు చేశారని, అయితే అతనిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో లేదో తెలియదని చెప్పుకొచ్చారు.

    20000 రూపాయలు ఇచ్చిన జార్ఖండ్ ప్రభుత్వం:

    తమకు డీఎస్పీ అనిమేష్ నాథాని సహాయ సహకారాలు అందుతున్నారని, బీజేపీ నాయకులు, వివిధ హిందూ సంస్థలకు చెందిన వారు నిత్యం తమ ఇంటికి వస్తున్నారని సాగర్ సోనీ తెలిపారు. బీజేపీ ఎమ్మెల్యే సమ్రిలాల్‌ నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయంగా అందిందని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని హేమంత్ సోరెన్ నేతృత్వంలోని కాంగ్రెస్-జెఎంఎం ప్రభుత్వం నుండి సహాయం పేరుతో తన కుటుంబానికి కేవలం రూ. 20,000 మాత్రమే అందిందని మృతుడి సోదరుడు తెలిపారు. “మేము ఎట్టి పరిస్థితుల్లోనూ తలవంచబోము” అని సాగర్ సోని అన్నారు.

    విశ్వహిందూ పరిషత్ మరియు భజరంగ్ దళ్ ఖలారీ బ్లాక్ ప్రెసిడెంట్ ముఖేష్ సోనీ డిసెంబర్ 15న సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో తన నగల దుకాణాన్ని మూసివేసి ఇంటికి తిరిగి వస్తుండగా ఖలారీ పోలీసుల పరిధిలోని రాంచీలోని మెక్‌క్లస్కీగంజ్ ప్రాంతంలో రెండుసార్లు కాల్పులు జరిపేరు.

    ఈ క్రూరమైన హత్యను విశ్వహిందూ పరిషత్ మరియు బజరంగ్ దళ్ తో పాటూ అనేక హిందూ సంస్థలు, బీజేపీ నాయకులు ఖండించారు. జార్ఖండ్‌లో హేమంత్ సోరెన్ ‘జంగల్ రాజ్’ గా మారిందని తీవ్ర విమర్శలు వచ్చాయి. జార్ఖండ్‌ను కేరళ, పశ్చిమ బెంగాల్‌గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు.

    Trending Stories

    Related Stories