More

    సాయి పల్లవి-రానాల విరాటపర్వం సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని ఫిర్యాదు

    రానా, సాయి ప‌ల్ల‌వి ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా తెర‌కెక్కిన విరాటప‌ర్వం సినిమాపై పోలీసుల‌కు ఫిర్యాదు అందింది. విశ్వ హిందూ ప‌రిష‌త్ (వీహెచ్‌పీ)కి చెందిన అజ‌య్ రాజ్ హైద‌రాబాద్‌లోని సుల్తాన్ బ‌జార్ పోలీస్ స్టేష‌న్‌లో ఈ సినిమాపై ఫిర్యాదు చేశారు. ఈ సినిమాకు అనుమ‌తి ఇచ్చిన సెన్సార్ బోర్డుపై చ‌ర్యలు తీసుకోవాలంటూ ఆయ‌న త‌న ఫిర్యాదులో పోలీసుల‌ను కోరారు.

    విశ్వ హిందూ పరిషత్‌ విద్యానగర్‌ జిల్లా కార్యదర్శి కె.అజయ్‌ రాజ్‌ సుల్తాన్‌బజార్‌ పోలీసులకు ఈ సినిమాపై ఫిర్యాదు చేశారు. విరాట పర్వం సినిమా శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉందన్నారు. పోలీసులను సైతం కించ పరిచే సన్నివేశాలు ఈ సినిమాలో ఉన్నాయి. ఇందులో చాలా అభ్యంతర మైన సన్నివేశాలు ఉన్నాయి కాబట్టి సినిమా ప్రదర్శనను వెంటనే ఆపివేయాలని పేర్కొన్నారు. అలాగే నిషేధిత సంస్థలైన నక్సలిజం, ఉగ్రవాదాన్ని ప్రేరేపించే సినిమాలకు సెన్సార్‌ బోర్డు ఎలా అనుమతులు ఇచ్చింది అని ప్రశ్నిస్తూ విరాటపర్వం సినిమాకు అనుమతులు ఇచ్చిన సెన్సార్‌ బోర్డు అధికారి శిఫాలి కుమార్‌ పై కూడా ఫిర్యాదు చేశారు. న‌క్స‌లిజం, ఉగ్ర‌వాదాల‌ను ప్రేరేపించేలా విరాటప‌ర్వం సినిమా ఉంద‌ని అజ‌య్ రాజ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఇలాంటి సినిమాల‌కు అనుమ‌తులు ఇవ్వ‌డంపై ఆయ‌న అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. యువ‌త‌ను పెడ‌దారి ప‌ట్టించేలా ఈ సినిమా ఉంద‌ని ఆయ‌న ఆరోపించారు.

    Trending Stories

    Related Stories