More

    చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. అరుణ్ బాలి క‌న్నుమూత‌

    ప్రముఖ నటుడు అరుణ్ బాలి మరణించారు. శుక్రవారం ఉదయం 4.30 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారని ఆయన కుమారుడు అంకుష్ బాలి తెలిపారు. దహన సంస్కారాలు శనివారం జరుగుతాయని ధృవీకరించారు. కొంతమంది కుటుంబ సభ్యులు US నుండి ముంబైకి రావాల్సి ఉందని.. అందుకోసమే అరుణ్ బాలి అంత్యక్రియలను శనివారం నిర్వహిస్తున్నామని తెలిపారు. శుక్రవారం నాడు ఆయన నటించిన ‘గుడ్ బై’ సినిమా విడుదలైంది. 1942లో పంజాబ్‌లోని జలంధర్‌లో జన్మించిన అరుణ్ బాలి 3 ఇడియట్స్ (2009), PK (2014), ఎయిర్‌లిఫ్ట్ (2016), కేదార్‌నాథ్ (2018), పానిపట్ (2019) వంటి అనేక చిత్రాలలో నటించారు. చంకయా, స్వాభిమాన్, కుంకుమ్ ప్యార సా బంధన్ వంటి అనేక టీవీ షోలలో కనిపించారు. ఆయ‌న వ‌య‌సు 79 ఏళ్లు. గ‌త కొన్నాళ్ల నుంచి ఆయ‌న ఆరోగ్యం స‌రిగా లేదు. న్యూరోమ‌స్క్యూలార్ వ్యాధితో ఆయ‌న బాధ‌ప‌డుతున్నారు.

    Trending Stories

    Related Stories