National

వాహనాల తుక్కు పాలసీని ప్రారంభించిన ప్రధాని మోదీ

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వాలంట‌రీ వెహికిల్ ఫ్లీట్ మోడెర్నైజేష‌న్ ప్రోగ్రామ్ (వాహ‌నాల తుక్కు పాల‌సీ)ని ప్రారంభించారు. శుక్ర‌వారం నాడు గుజ‌రాత్‌లో జ‌రిగిన పెట్టుబ‌డిదారుల స‌ద‌స్సులో వ‌ర్చువ‌ల్‌గా పాల్గొన్న మోదీ వాహ‌నాల తుక్కు పాల‌సీ విధానాన్ని ప్రారంభిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ తుక్కు పాల‌సీ రూ.10 వేల కోట్ల పెట్టుబ‌డుల‌ను తీసుకురానున్న‌ట్లు మోదీ చెప్పారు. దేశ అభివృద్ధి ప్రస్థానంలో వెహికిల్ స్క్రాపింగ్ పాలసీ ఓ గొప్ప మైలురాయి అని చెప్పారు. ఇది చెత్త నుంచి సంపదను సృష్టించే పధకమని తెలిపారు. సరికొత్త స్టార్టప్‌లు ఈ రంగంలో వెలుస్తాయని, ముఖ్యంగా దేశంలో ఉన్న మధ్యతరగతికి ఈ పాలసీ వల్ల మేలు జరుగుతుందన్నారు. గుజ‌రాత్‌లోని అలంగ్ ఈ వాహ‌నాల తుక్కుకు హ‌బ్‌గా మార‌గ‌ల‌ద‌ని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. కాలుష్యాన్ని తగ్గించే పనిలో భాగంగా కాలపరిమితి నిండిన వాహనాలను తుక్కుగా మార్చేందుకు తెచ్చిన కొత్త పాలసీలో మెరుగైన అవకాశాలు ఉన్నాయని.. ఇకపై నిరుపయోగంగా ఉన్న వాహనాల్ని దశల వారీగా తగ్గించాలని మోదీ సూచించారు. ఈ పని చేసేందుకు స్టార్టప్‌ కంపెనీలు ఏర్పాటు చేయాలని యువతను ప్రధాని ఆహ్వానించారు. ఈ పాలసీ వల్ల దేశవ్యాప్తంగా ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లు, రిజిస్టర్డ్ వెహికిల్ స్క్రాపింగ్ ఫెసిలిటీస్ ఏర్పాటుకు వీలవుతుందన్నారు. అందుకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్లు చేశారు.

ప్రధాని మోదీ మరింత సమాచారాన్ని తెలియజేస్తూ.. ముందుగా, పాత కారును స్క్రాప్ చేయడంపై ఒక సర్టిఫికెట్ ఇవ్వబడుతుంది.. ఈ స్క్రాప్ సర్టిఫికెట్ తో కొత్త కారును కొనుగోలు చేసేటప్పుడు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదని అన్నారు. అతనికి రోడ్డు టాక్స్ పై డిస్కౌంట్ కూడా లభిస్తుంది. పాత కారు నిర్వహణ వ్యయం, మరమ్మత్తు ఖర్చు, ఇంధన సామర్థ్యం వంటి వాటిపై డబ్బు ఆదా చేయబడుతుందని మోదీ అన్నారు. మూడవ ప్రయోజనం నేరుగా జీవితానికి సంబంధించినదని పాత వాహనాలు మరియు పాత టెక్నాలజీ కారణంగా రోడ్డు ప్రమాదాల అధిక ప్రమాదం ఉంటుందని.. దీని నుండి కొంత ఉపశమనం లభిస్తుందని అన్నారు. కాలుష్యం తగ్గించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడిన వాళ్లమవుతామని మోదీ చెప్పుకొచ్చారు. వాహనం పాతది అయినంత మాత్రాన స్క్రాప్ చేయబడదని స్క్రాపేజ్ సెంటర్లలో ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించబడతాయని అన్నారు. శాస్త్రీయ పద్ధతుల ద్వారా పరీక్షలు చేసి.. స్క్రాప్ చేయబడుతుందని మోదీ వివరించారు.

ఈ కార్య‌క్ర‌మానికి కేంద్ర రోడ్డు ర‌వాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీ ప్ర‌త్య‌క్షంగా హాజ‌ర‌య్యారు. ఈ తుక్కు పాల‌సీ కార‌ణంగా ముడి స‌రుకుల ధ‌ర‌లు 40 శాతం వ‌ర‌కూ త‌గ్గుతాయ‌ని గ‌డ్క‌రీ అన్నారు. ఆటోమొబైల్ త‌యారీలో భారత్ ఇండ‌స్ట్రియ‌ల్ హ‌బ్‌గా మారుతుంద‌ని.. ప‌బ్లిక్ ప్రైవేట్ భాగ‌స్వామ్యంతో దేశంలోని అన్ని జిల్లాల్లో టెస్టింగ్ కేంద్రాల‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు గ‌డ్క‌రీ తెలిపారు. దేశంలో ఎటువంటి వ్యాలిడ్ ఫిట్‌నెస్ లేని వాహనాలు దాదాపు 1 కోటి వరకు ఉన్నాయన్నారు. వాహనం వయసునుబట్టి కాకుండా, దాని ఫిట్‌నెస్ ఆధారంగా ఈ స్క్రాపింగ్ పాలసీ వర్తిస్తుందన్నారు. ప‌బ్లిక్ ప్రైవేట్ భాగ‌స్వామ్యంతో దేశంలోని అన్ని జిల్లాల్లో టెస్టింగ్ కేంద్రాల‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు గ‌డ్క‌రీ తెలిపారు.

పాత‌, కాలుష్యానికి కార‌ణ‌మ‌వుతున్న త‌మ వాహ‌నాల‌ను తుక్కు కింద మార్చ‌డానికి ముందుకు వ‌చ్చే య‌జ‌మానుల‌కు ఈ కొత్త విధానం కార‌ణంగా ల‌బ్ధి క‌ల‌గ‌నుంది. ఈ విధానంలో భాగంగా 15 ఏళ్లు పైబ‌డిన‌ వాణిజ్య వాహ‌నాలు, 20 ఏళ్లు పైబ‌డిన వ్య‌క్తిగ‌త వాహ‌నాలను తుక్కు కింద మార్చనున్నారు. మొద‌ట ఈ విధానాన్ని ప్ర‌భుత్వ వాహ‌నాల‌కు అమ‌లు చేయ‌నుండ‌గా.. ఆ త‌ర్వాత భారీ వాణిజ్య వాహ‌నాలు, వ్య‌క్తిగ‌త వాహ‌నాల‌కు అమ‌లు చేయనున్నారు. వ‌చ్చే ఏడాది ఏప్రిల్‌లోగా కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల ద‌గ్గ‌ర ఉన్న 15 ఏళ్లు పైబ‌డిన వాహ‌నాల‌ను తుక్కుగా మార్చాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. వ్య‌క్తిగ‌త వాహ‌నాల‌ను 2024 జూన్ నుంచి తుక్కు చేయనున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

1 × 2 =

Back to top button