మళ్లీ ‘వర్షం’ వస్తోంది : 11న విడుదలకు సిద్ధం

0
916
prabhas trisha varsham re relses on Nove 11th
prabhas trisha varsham re relses on Nove 11th

తంలో సూపర్ డూపర్ హిట్ అయిన “వర్షం” సినిమా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలోని థియేటర్లలో ఈ నెల 11న రీ రిలీజ్ కానుంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, త్రిష హీరో హీరోయిన్లుగా, గోపీచంద్ ప్రతి నాయకుడిగా శోభన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకాభిమానులను ఎంతగానో అలరించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ప్రభాస్ తో పాటు ఇతర నటీనటులంతా అత్యుత్తమ నటనను కనబరిచిన ఈ సినిమాలోని పాటలు కూడా వీనులవిందుగా ఆకట్టుకున్న సంగతి వేరుగా చెప్పనక్కరలేదు. ఆ రోజులలో ప్రభాస్ కెరీర్ మలుపులో ఈ సినిమా అగ్ర భాగాన నిలిచింది కూడా. “ఈశ్వర్” సినిమాతో తన కెరీర్ ను ఆరంభించిన ప్రభాస్ ఈ నెల 11 నాటికి కరెక్ట్ గా 20 ఏళ్ల కెరీర్ ను పూర్తి చేసుకుంటున్న సందర్భంగా “వర్షం” సినిమాను తమ నట్టీస్ ఎంటర్టైన్మెంట్స్ తరపున రీ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ నట్టి కుమార్ తెలియజేశారు. ఇప్పటికే ఆన్ లైన్లో టిక్కెట్ల బుకింగ్ మొదలయ్యిందని, స్పీడ్ గా టిక్కెట్లు బుక్ అవుతూ, విశేష స్పందన లభిస్తోందని ఆయన పేర్కొన్నారు.
థియేటర్లను దేవాలయాల మాదిరిగా చూసుకోం : నట్టి కుమార్ విజ్ఞప్తి
తమ అభిమాన హీరోల సినిమాలను ప్రదర్శించే థియేటర్లను ఆయా హీరోల అభిమానులంతా దేవాలయాలు మాదిరిగా భావించి, వాటిని కాపాడుకోవాలని నట్టి కుమార్ విజ్ఞప్తి చేశారు. కొన్ని ప్రాంతాలలో సినిమాల విడుదల సందర్భంగా అభిమానుల కోలాహలంలో థియేటర్లు డామేజ్ అయిన సంఘటనలు జరిగాయని, దయచేసి అభిమానులు తమ కోలాహలాన్ని కొనసాగిస్తూనే, థియేటర్లను దేవాలయాలు మాదిరిగా కాపాడుకోవాలని నట్టి కుమార్ అందరు హీరోల అభిమానులకు పిలుపునిచ్చారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

eight − 7 =